త్వరలోనే కొరియన్ కంపెనీల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణలోకి వచ్చే దక్షిణ కొరియా పెట్టుబడులకు పూర్తి సహాకారం ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో కొరియా దేశ ప్రతినిధి బృందం “ కొరియా కారవాన్”తో సమావేశం అయ్యారు. ప్రతి ఎడాది దేశంలోని రెండు మూడు రాష్ట్రాలను ఎంచుకుని స్ధానిక కొరియా రాయభార కార్యాలయం ఈ కొరియా కారనాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈసారి తెలంగాణను ఎంచుకుని ఇక్కడి పెట్టుబడి అవకాశాలు, రాష్ట్రంతో సంబంధాలను బలోపేతం చేయడం కోసం 48 మందితో కూడిన బృందం తెలంగాణలో పర్యటిస్తున్నది.
ఈ సందర్భంగా కొరియా బృందంతో సమావేశం అయిన మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని పెట్టుబడుల అవకాశాలను వివరించారు. తెలంగాణ భారతదేశంలో ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మెదటి స్ధానంలో ఉన్నదని, తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ దేశంలోనే అత్యుత్తమైనదని తెలిపారు. ఇప్పటికే పలు దేశాలకు చెందిన భారీ పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని, ముఖ్యంగా ఐటి రంగంలో టాప్ 5 కంపెనీలు ఇక్కడ తమ కార్యాలయాలు ఏర్పాటు చేశాయన్నారు. ఐటి తోపాటు 14 ఇతర రంగాలను తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి అనుమతులు, రాయితీలను కల్పిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు కొరియన్ కంపెనీలు తమ పెట్టుబడులు పెట్టాయన్న మంత్రి కేటీఆర్, ఇక్కడ ప్రత్యేకంగా కొరియన్ కంపెనీల కోసం కొరియా క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉన్నదన్నారు. ఇందుకోసం కొరియా పారిశ్రామిక వర్గాలు (కొరియా ఇంటర్నెషనల్ ట్రేడ్ అసోషియేషన్ (కీటా), కొరియా ట్రేడ్ ఇన్వేస్ట్ మెంట్ ప్రొమోషన్ ఎజెన్సీ(కొట్రా) మొదలైన సంస్ధలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల మీద ప్రతిపాదనలు ఇవ్వాలని కొరియా ప్రతినిధి బందాన్ని కోరారు.
ప్రస్తుతం అసియాలోని అతిపెద్ద లైఫ్ సైన్సెస్ క్లస్టర్ జినోమ్ వ్యాలీ, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఫార్మసిటీలకు తెలంగాణ కేంద్రంగా ఉన్నదని తెలిపారు. దీంతోపాటు దేశంలోనే అతిపెద్ద టెక్స్ టైల్ రంగంలోని మెగా టెక్స్ టైల్ పార్కు వరంగల్ లో సిద్దం అవుతున్నదని, కొరియన్ టెక్స్ టైల్ కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చేందుకు సహాకరించాలన్నారు.
ఇప్పటికే తమ ప్రభుత్వం దక్షిణ కొరియా టెక్స్ టైల్ కంపెనీల అర్గనైజేషన్ తో చర్చలు జరిపామని తెలిపారు. అవసరం అయితే త్వరలోనే కొరియా కంపెనీల కోసం ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ఒక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కొరియన్ స్టార్ట్ అప్స్, మరియు ఇన్నోవేషన్ కంపెనీలు తెలంగాణలోకి ప్రవేశించేందుకు ప్రభుత్వంతోపాటు ఇక్కడి టి-హబ్ సహాకారం అందిస్తాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ కేవలం పెట్టుబడులకు మాత్రమే కాకుండా ఇక్కడ నివాసం ఏర్పరుచుకోవడానికి అత్యుత్తమ ప్రదేశం అని, మెర్సర్ లాంటి ప్రముఖ కంపెనీలు వరుసగా ప్రథమ స్థానాన్ని కట్టబెడుతున్నాయన్నారు. దీంతోపాటు నగరంలో ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు వంటి మౌళిక వసతులు, యూనివర్సీటీలు, హెల్త్ కేర్ రంగ వసతులు ఇక్కడకి నూతన కంపెనీలు వచ్చేందుకు ఉపయుక్తంగా ఉంటాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం కొరియన్ బృందానికి ఇచ్చిన స్వాగతంపైన కొరియన్ రాయభారి షిన్ బొంగ్ కిల్( Shin Bongkil) దన్యవాదాలు తెలిపారు. తమ ప్రతినిధి బృందం ఇక్కడి వ్యాపార వాణిజ్య అవకాశాలతోపాటు, సాంస్కృతిక సంబంధాల బలోపేతం పైన దృష్టి సారిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజెంటేషన్ చూశాక తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడుల పట్ల ఉన్న ఆసక్తి, విజన్ అర్ధం అవుతున్నదని అభినందనలు తెలిపారు.
లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఐటి, ఏరోస్పేస్ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి నేతృత్వంలో రాష్ట్రం వ్యాపారాభివృద్ది, పెట్టుబడుల ఆకర్షణకు సానుకూలంగా ఉన్నదని రాయభారి షిన్ బోంగ్ కిల్ తెలిపారు. ప్రస్తుతం భారత్ తో దక్షిణా కొరియాతో గొప్ప సంబంధాలున్నాయని తెలిపారు. భారత్ పెరుగుతున్న అర్ధిక వ్యవస్ధ అని, ఇక్కడి భారీ మార్కెట్ లో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటామన్నారు. ఈనేపథ్యంలో అనేక కొరియా కంపెనీలు భారతదేశానికి పెట్టుబడులతో తరలివస్తున్నాయని తెలిపారు.
ప్రస్తుతం భారతదేశం కొరియా యెక్క న్యూ ఫ్రాంటియర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ఇక్కడి పెట్టుబడుల వాతావరణం చాలా ప్రొత్సాహాకంగా ఉన్నదని, ఈ సమావేశంలో చర్చించిన తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలపైన సానూకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషి తెలంగాణ ఈజ్ డూయింగ్ బిజినెస్ తోపాటు ఈజ్ అఫ్ లివింగ్ పైన కూడా ప్రధాన దృష్టి సారిస్తున్నదని, దక్షిణ కొరియాతో స్నేహ బంధం మరింత బలపడాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సినీయర్ ఐఏయస్ అధికారులు అజయ్ మిశ్రా, జనార్ధన్ రెడ్డి, రామకృష్టరావు, సోమేష్ కూమార్, జయేష్ రంజన్, హర్విందర్ సింగ్, స్ధానిక ప్రాంతీయ పాస్ పొర్ట్ కార్యాలయ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.