‘క్రాక్’ నుండి “కోర‌మీసం పోలీసోడా..” పాట విడుద‌ల‌

2771
Korameesam Polisoda Song
- Advertisement -

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’ షూటింగ్ మొత్తం పాట‌ల‌తో స‌హా పూర్త‌యింది. ఎస్‌. త‌మ‌న్ బాణీలు స‌మ‌కూర్చిన రెండు పాట‌ల‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. మ్యూజిక‌ల్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మూడో సాంగ్ లిరిక‌ల్ వీడియోను ఈరోజు (డిసెంబ‌ర్ 25) విడుద‌ల చేశారు.

“కోర‌మీసం పోలీసోడా..” అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలోడీకి రామ‌జోగ‌య్య శాస్త్రి అర్థ‌వంత‌మైన సాహిత్యం అందించారు. గాయ‌ని ర‌మ్యా బెహ‌రా త‌న సుమ‌ధుర గాత్రంతో ఈ పాట‌కు ప్రాణం పోశారు. పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ర‌వితేజ‌ను టీజ్ చేస్తూ శ్రుతి హాస‌న్ పాడే పాట‌గా దీనిని చిత్రీక‌రించారు. మునుపు విడుదల చేసిన రెండు పాట‌లు ఇప్ప‌టికే సంగీత ప్రియుల‌ను అల‌రిస్తూ మ్యూజిక్ చార్టుల్లో ముందు వ‌రుస‌లో ఉండ‌గా, ఇప్పుడు రిలీజ్ చేసిన “కోర‌మీసం పోలీసోడా..” సాంగ్ వాటికి మించిన బెస్ట్ సాంగ్ అని చెప్ప‌డానికి సందేహించాల్సిన అవ‌స‌రం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్‌’లో ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకొనే అంశాలున్నాయి. ఇదివ‌ర‌కు విడుద‌ల చేయ‌గా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌యిన‌ “భూమ్ బ‌ద్ద‌ల్” స్పెష‌ల్ సాంగ్‌లో ర‌వితేజ‌తో క‌లిసి అప్స‌రా రాణి స్టెప్పులేశారు. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ల‌లో క‌నిపించ‌నున్నారు. ఎస్. త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. సంక్రాంతి కానుక‌గా ‘క్రాక్’ మూవీని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

తారాగ‌ణం:ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి
సాంకేతిక బృందం:
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: గోపీచంద్ మ‌లినేని
నిర్మాత‌: బి. మ‌ధు
బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్‌
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: జి.కె. విష్ణు
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
స‌హ నిర్మాత‌: అమ్మిరాజు కానుమిల్లి
కూర్పు: న‌వీన్ నూలి
ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌
ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌
పాట‌లు: రామ‌జోగ‌య్య శాస్త్రి
పీఆర్వో: వంశీ-శేఖ‌ర్

- Advertisement -