క్రాక్‌ మూవీపై చిరంజీవి ప్రశంసలు!

175
chiru
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా గ్లామర్ స్టార్ శృతిహాసన్ హీరోయిన్ గా సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బి. మధు నిర్మించిన చిత్రం “క్రాక్”. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి రేసులో హిట్ సినిమాగా నిలిచింది.

ఇప్పటికే పలువురు క్రాక్ మూవీపై ప్రశంసలు గుప్పించగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి క్రాక్ మూవీని చూసి తన మెమోరీస్ గుర్తు చేసుకున్నారు.
తాను ఒంగోలులో చ‌దువుతున్న స‌మ‌యంలో వేట‌పాలెం గ్యాంగ్‌, వారి ఆహార‌పు అల‌వాట్లు గురించి గగుర్పొడిచే విష‌యాలు వినేవాడిన‌ని చెప్పారు. రాత్రి పూట క‌రెంట్ క‌ట్ చేసి..హ‌త్య‌లు చేసిన విష‌యాలు ఆ సమ‌యంలో ఉండేవ‌ని చెప్పుకొచ్చాడు.

త‌న అనుభ‌వాల‌ను గోపీచంద్ మ‌లినేనితో పంచుకున్న చిరు..ఆచార్య సెట్స్ కు ఒక‌సారి రావాల‌ని డైరెక్ట‌ర్ గోపీచంద్ ను ఆహ్వానించాడ‌రని సమాచారం.

- Advertisement -