సూర్యాపేటలో కరోనా కలకలం.. ఒకే ఇంట్లో 22 మందికి పాజిటివ్‌..

53
coronavirus

సూర్యాపేటలో కరోనా కలకలం.. జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలకలం రేపింది. ఈ 22 మందితో కాంటాక్టుయిన మరో ఆరుగురికి సైతం పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తున్నది. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మృతి చెందగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యాదాద్రి టౌన్‌షిప్‌లో నివాసం ఉండే మృతుడి బంధువులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంత్యక్రియలకు హాజరైన వారిలో ఓ వ్యక్తికి ఆరోగ్య సమస్యలు తలెత్తగా పరీక్ష చేయించుకోగా కొవిడ్‌ -19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో రంగంలోకి దిగిన అధికారులు కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా అందరికీ పాజిటివ్‌గా తేలిందని డీఎంహెచ్‌ఓ తెలిపారు. బాధితుల్లో లక్షణాలేవీ కనిపించకపోయినా పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం యాదాద్రి టౌన్‌ షిప్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇంటింటిని సర్వే చేస్తున్నారు. బాధితులంతా హోంక్వారంటైన్‌లో ఉన్నారు.