కొండపోచమ్మ సాగర్‌తో హైదరాబాద్‌కు తాగునీరు

376
kondapochamma sagar reservior
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైన కొండపోచమ్మ సాగర్‌తో హైదరాబాద్ ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ ఐదు జిల్లాలకు వరప్రదాయినిగా మారనుంది.

సిద్దిపేట , సంగారెడ్డి, మెదక్‌, యదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను ఈ రిజర్వాయర్‌ తీర్చనున్నది. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట వద్ద నిర్మిస్తున్న కేశవపూర్‌ ద్వారా రిజర్వాయర్‌ జంటనగరాలకు తాగునీరు అందించనున్నది. సంగారెడ్డి కెనాల్‌ నుంచి సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాలకు నీటిని పంపిస్తారు. జగదేవ్‌పూర్‌ కెనాల్‌ నుంచి యాదాద్రి జిల్లాకు నీటినందించనున్నారు. ఐదుజిల్లాలో మొత్తం 2,85,280 ఎకరాలకు సాగునీరు అందనుంది.

- Advertisement -