దసరాకి ‘సోలో బ్రతుకే సో బెటర్‌’..!

224
sai tej
- Advertisement -

సాయి ధరమ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. తేజు సరసన నభ నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సింగిల్‌కి మంచిరెస్పాన్స్ వచ్చింది. ‘నో పెళ్లి అంటూ సాగే సాంగ్‌ను నితిన్ విడుదల చేయగా ఈ పాటలో రానా, వరుణ్ తేజ్ కూడా సందడి చేయడం విశేషం.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. వాస్తవానికి ఏప్రిల్‌లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేయగా లాక్ డౌన్ వల్ల షెడ్యూల్స్ వల్ల క్యాన్సిల్ అయింది.

శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ఈ చిత్రాన్ని బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో హిట్ కొట్టాలనే సంకల్పంతో ఉన్నారు తేజు.

- Advertisement -