- Advertisement -
సోషల్ మీడియాలో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చివరి మాటలంటూ వైరల్ అవుతోన్న ఫేక్ ఆడియోపై చర్యలు తీసుకోవాల్సిందిగా నర్సింహయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ వాయిస్ తనదేనంటూ కోదాడకు చెందిన మిమిక్రీ ఆర్టిస్ట్ కొండల్ తెలిపారు.
నోములపై ఉన్న అభిమానంతోనే ఆ వాయిస్ చేశానని తెలిపిన కొండల్…కొంతమంది కావాలని ఆ వీడియో వైరల్ చేశారని తెలిపారు. నోముల బ్రతికుంటే ఎలా స్పందించేవారో తనతో 20 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా ఆడియో చేశానని… నోముల కుటుంబ సభ్యులకు క్షమాపణ తెలిపిన కొండల్ తనని మన్నించాలని కోరాడు.
తన తండ్రి అభివృద్ధి కోసమే ఎర్రజెండాను వీడి టీఆర్ఎస్‌లో చేరాడని స్పష్టం చేశారు నోముల భగత్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో తన తండ్రి నోములది కాదని అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
- Advertisement -