మూడో వన్డేలో కోహ్లీ సేన గెలుపు…

208
ind
- Advertisement -

ఆసీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత్ పరువు దక్కించుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి సిరీస్ దక్కించుకున్న ఆసీస్ మూడో వన్డేలో పరాజయం పాలైంది. భారత్ విధించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 49.3 ఓవర్లలో 289 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచి పరువు దక్కించుకుంది. ఆసీస్ జట్టులో ఫించ్ 75,మ్యాక్స్ వెల్ 59 పరుగులతో రాణించగా మిగితా బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు.

అంతకముందు టాస్ గెలిచిన కోహ్లీ….బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాప్, మిడిలార్డ‌ర్ ఫెయిలైనా.. చివ‌ర్లో ఆల్‌రౌండ‌ర్లు హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జడేజా చెల‌రేగ‌డంతో 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 302 ప‌రుగులు చేసింది టీమిండియా. కోహ్లీ 63 పరుగులతో మరోసారి రాణించగా ఓపెన‌ర్లు ధావ‌న్ (16), శుభ్‌మ‌న్ గిల్ (33) విఫలమయ్యారు.

అయితే మరోసారి పాండ్యా,జడేజా భారత్‌ను ఆదుకున్నారు. పాండ్యా 76 బంతుల్లో 92 ప‌రుగులు చేయ‌గా.. జ‌డేజా 50 బంతుల్లో 66 ప‌రుగులు చేశారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఆరో వికెట్‌కు అజేయంగా 150 ప‌రుగులు జోడించారు. ఒక ద‌శ‌లో 152 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోగా మూడు వందల పరుగుల మార్క్ దాటడంలో కీలక పాత్ర పోషించారు.

- Advertisement -