కొండగట్టు అటవీకి రెండంచల అభివృద్ధి..

48
- Advertisement -

జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అభివృద్దిలో భాగంగా అటవీ ప్రాంతాన్ని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్ పర్యటించారు. ఇటీవల కొండగట్టు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆంజనేయస్వామి గుడి, పరిసర ప్రాంతాలను అభివృద్ది చేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశాలతో కొండగట్టులో పర్యటించారు. ఆలయ అభివృద్ధి పునర్ నిర్మాణంను ప్రకటించిన తర్వాత బీఆర్‌ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ తరపున కొండగట్టును ఆనుకొని ఉన్న కొడిమ్యాల అటవీ ప్రాంతం సంరక్షణ నిమిత్తం దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే.

సీఎం ఆదేశాల మేరకు కొండగట్టు ప్రాంతంను రెండు బ్లాక్‌లుగా విభజించి ఆలయ పునర్నిర్మాణం అభివృద్ది చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా పలు సూచనలు, ప్రణాళికలు, ఇతర వివరాలతో కూడిన అభివృద్ధిపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అటవీ ప్రాంతంకు చుట్టు అవసరమైన చోట రక్షణ కంచెను ఏర్పాటు చేయాలని అన్నారు. సుమారు 5కిలోమీటర్లు కాలినడక మార్గంను మట్టితో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

వెయ్యి ఎకరాల్లో ఔషద సుగంధ మొక్కల పెంచనున్నట్టు అందుకోసం కావాల్సిన నర్సరీల ఏర్పాటు మరియు వాచ్ టవర్ నిర్మాణంను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు సేద తీరేందుకు వీలుగా గజేబో నిర్మాణంను తొలి దశలో ఏర్పాటు చేయాలని అదేశించారు. ఆలయ పరిసరాల్లో విస్తారంగా తిరిగే కోతుల కోసం ముందుగా పండ్ల మొక్కలను పెంచాలన్నారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని పీసీసీఎఫ్ తెలిపారు. ఈ పర్యటనలో శరవణన్ ముఖ్య అటవీ సంరక్షణాధికారి, బాసర సర్కిల్ వెంకటేశ్వరావు, జగిత్యాల జిల్లా అటవీ అధికారి లత, రేంజ్ ఆఫీసర్ మౌనిక, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీ సాయిరాం, బీట్ ఆఫీసర్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

వైద్యశాఖలో 1400అసిస్టెంట్ ప్రొఫెసర్..

మొక్కలు నాటిన సాయి కృష్ణ…

21 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు..

- Advertisement -