21 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు..

57
- Advertisement -

ఈ నెల 21 నుండి యాదాద్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం స్వస్తీవాచనం, రక్షాబంధనం నిర్వహిస్తారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహనతో మొదటి రోజు క్రతువుతు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలు, సుదర్శన నరసింహ హోమం, నిత్య కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను అధికారులు రద్దు చేశారు.

బ్రహ్మోత్సవాల షెడ్యూల్..

()21న ఉదయం 10 గంటలకు విశ్వక్సేన ఆరాధన, స్వస్తీవాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోహన
()22న ఉదయం 8 గంటలకు అగ్నిప్రతిష్ఠ, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానంహవనం నిర్వహిస్తారు.
()23న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకారం చుడతారు. ఉదయం 9 గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం, రాత్రి 7 గంటలకు శేష వాహన సేవ ఉంటుంది.
()24న ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ.
()25న ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణాలంకార సేవ రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ నిర్వహిస్తారు.
()26న ఉదయం 9 గంటలకు గోవర్దన గిరిధారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహ వాహన అలంకార సేవ ఉంటుంది.
()27న ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 7 గంటలకు అశ్వవాహన సేవ, అనంతరం శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు.
()ఫిబ్రవరి 28న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకార (హనుమంత వాహనం) సేవ, రాత్రి 8 గంటల నుంచి గజవాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం
()మార్చి 1న ఉదయం 9 గంటలకు గరుడ వాహన సేవ, రాత్రి 7గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం ఉంటుంది.
()మార్చి 2న ఉదయం 10.30 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, సాయంత్రం 6 గంటలకు శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన ఉంటుంది.
()3న ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు సమాప్తమవుతాయి.

- Advertisement -