కోమటి పెట్టిన మంట.. కాంగ్రెస్‌లో పెంట పెంట !

26
- Advertisement -

రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలాంటి విమర్శలు చేస్తారో ఊహించడం కష్టం. కొన్ని కొన్ని సార్లు వాళ్ళు చేసే విమర్శలు తీవ్ర చర్చనీయాంశం అవ్వడంతో పాటు.. వివాదాస్పదం కూడా అవుతుంటాయి. తాజాగా తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విధంగా చర్చనీయాంశం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కూడా స్పష్టమైన ఆధిక్యం రాదని, అధికారం చేపట్టలంటే రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ మద్య పొత్తు ఉండే అవకాశం ఉందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించడంతో అటు బి‌ఆర్‌ఎస్ నేతల నుంచి, ఇటు కాంగ్రెస్ నేతల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. .

ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అసలు పార్టీలో ఎవరితో సంప్రదింపులు జరపకుండా పొత్తు వ్యవహారాన్ని తెరపైకి తీసుకురావడం ఏంటని హస్తం నేతలు ఫైర్ అవుతున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ కు డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని భావించిన హస్తం నేతలు.. ఆ వ్యాఖ్యలను కవర్ చేసే పనిలో ఉన్నారు. బి‌ఆర్‌ఎస్ తో ఎలాంటి పొత్తు ఉండబోదని చెబుతున్నారు. ఈ వ్యవహారం పై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ థాక్రే స్పందిస్తూ.. బి‌ఆర్‌ఎస్ తో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తు ఉండబోదని, బి‌ఆర్‌ఎస్ ను ప్రత్యర్థి పార్టీగానే చూస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక పార్టీ వ్యవహారాలకు సంబంధించి గత కొన్నాళ్లుగా కోమటిరెడ్డి అంటిఅంటనట్టుగానే ఉంటున్నారు. ఒకానొక సమయంలో ఆయన కాంగ్రెస్ వీడే అవకాశం కూడా ఉందనే వార్తలు వచ్చాయి. ఇక మునుగోడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఓడిపోతుందని చెప్పడంతో ఆయనపై కోవర్ట్ అనే ముద్ర కూడా పడింది. దీంతో అప్పటి నుంచి కోమటిరెడ్డి కాంగ్రెస్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన పార్టీలో చిచ్చు పెడుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ బి‌ఆర్‌ఎస్ పొత్తు అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో ఆయనను పార్టీ నుంచి భహిష్కరించాలనే డిమాండ్లు హస్తం నేతల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తానికి పొత్తు రాజకీయంతో కోమటిరెడ్డి పెట్టిన మంట కాంగ్రెస్ లో పెంట పెంట చేస్తుందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -