రస్సెల్ విధ్వంసం.. బెంగుళూరు ఖాతాలో మరో ఓటమి

258
Russel
- Advertisement -

ఈఐపిఎల్ లో బెంగుళూరు టీం వరుసగా ఓటమిపాలవుతుంది. ఈసిరీస్ లో ఇప్పటివరకూ 5మ్యాచ్ లు ఆడగా అందులో ఒక్కటి కూడా గెలుపొందలేదు. నిన్న కోల్ కత్తాతో జరిగిన మ్యాచ్ లో భారీ స్కొర్ చేసిన బెంగుళూరుకు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు నిర్ణిత 20ఓవర్లలో 206పరుగులు చేసింది. బ్యాటింగ్ లో బెంగుళూరు గత మ్యాచ్ లకంటే పరవాలేదు అనిపించినా బౌలింగ్ లో మాత్రం విఫలం చెందింది. కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి 49బంతుల్లో 84పరుగులు చేశాడు.

ఏబీ డివిలియర్స్ కూడా చెలరేగిపోయాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్ 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఇక 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కత్తాకు ఈస్కొర్ సవాల్ గా మారింది. అందరూ బెంగుళూరు విజయం ఖాయం అనుకున్నారు. కానీ రసెల్ విధ్వంసం సృష్టించడంతో ఇంకా 5బంతులు మిగిలి ఉండగానే కోల్ కత్తా విజయం సాధించింది.

కోల్ కత్తా బ్యాట్స్ మెన్లు క్రిస్ లిన్ 43, రాబిన్ ఉతప్ప 33, నితీశ్ రాణా 37 పరుగులు చేశారు. ఓ దశలో కోల్‌కతా ఓటమి ఖాయమని అందరూ భావించారు. అయితే, ఆండ్రూ రస్సెల్ క్రీజులోకి వచ్చిన తర్వాత బెంగుళూరు బౌలర్లకు చుక్కలు చూపించాడు. 13బంతుల్లో 48 పరుగులు చేసి కోల్ కత్తా విజయంలో కీలక పాత్ర వహించారు. ఏదిఏమైనా ఇలా బెంగుళూరు ఆడిన ప్రతి మ్యాచ్ లో ఓటమి పాలవ్వడం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది.

- Advertisement -