ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా రాజస్ధాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్ కతా ఘన విజయం సాధించింది. 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్ధాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 131 పరుగులు చేసింది . దీంతో 60 పరుగుల తేడాతో కోల్ కతా ఘన విజయం సాధించింది.
192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్ధాన్ టాప్ ఆర్డర్‌ని దెబ్బతీశాడు కమిన్స్. పదునైన బంతులతో రాజస్దాన్ ఆటగాళ్లు ఒక్కొక్కరిని పెవిలియన్‌కు పంపాడు. రాబిన్ ఉతప్ప(6), బెన్‌స్టోక్స్(18), స్టీవ్ స్మిత్(4)లను కమిన్స్ ఔట్ చేసి మ్యాచ్‌ను కోల్‌కతా వైపు తిప్పాడు. దీంతో 5 ఓవర్లకు రాజస్థాన్ 5 వికెట్లు కొల్పోయి 37 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఈ దశలో మరో వికెట్ పడకుండా తెవాటియాతో కలిసి బట్లర్ కాసేపు పోరాడిన 35 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో రాజస్ధాన్ ఓటమి ఖాయమైపోయింది.
అంతకముందు టాస్ గెలిచిన రాజస్ధాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్ కతా భారీ స్కోరు సాధించింది.కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(68 నాటౌట్: 35 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(36),రాహుల్ త్రిపాఠి(39) రాణించగా రాహుల్ తెవాటియా(3/25) రాణించాడు.