ప్లే ఆఫ్స్‌కు చేరిన కేకేఆర్‌

73
kkr

ఐపీఎల్ 2021లో భాగంగా ప్లే ఆఫ్స్‌కి చేరింది కోల్ కతా నైట్ రైడర్స్. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 86 పరుగుల తేడాతో గెలుపొందింది. కేకేఆర్ విధించిన 172 పరుగుల లక్ష్యచేదనలో కేవలం 85 పరుగులకే చాప చుట్టేసింది రాజస్థాన్.

ఒకానొక దశలో 35 పరుగులకే 7 వికెట్లు కొల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడగా రాహుల్ తెవాటియా(44) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయినా రాజస్ధాన్ 85 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్‌ బౌలర్లలో శివమ్ మావి నాలుగు వికెట్లు పడగొట్టి రాజస్తాన్‌ పతనాన్ని శాసించాడు. లాకీ ఫెర్గూసన్ 3 వికెట్లు, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్‌ సాధించారు.

అంతకముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నీర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్ (56) అయ్యర్ (38) పరుగులతో కేకేఆర్‌ భారీ స్కోర్‌ చేయడంలో కీలక పాత్ర పోషించారు.