టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌..

204
kkr
- Advertisement -

ఐపీఎల్‌ 14వ ఎడిషన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వాంఖడే వేదికగా నేడు చెన్నై, కేకేఆర్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. చెన్నై.. తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఓటమిపాలైనప్పటికీ, ఆవెంటనే కోలుకొని వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి హ్యాట్రిక్‌ విజయంపై కన్నేయగా, కేకేఆర్‌ పరిస్థితి ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది.

కోల్‌కతా..తమ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయ ఢంకా మోగించి, ఆ తరువాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసింది. ఇరు జట్లు ముఖాముఖి పోరులో మొత్తం 24 సార్లు తలపడగా, చెన్నై 15 సందర్భాల్లో విజయం సాధించి కేకేఆర్‌పై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. మరోవైపు కేకేఆర్‌ మాత్రం కేవలం 9 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించి ముఖాముఖి పోరులో వెనకపడి ఉంది.

తుది జట్లు :

చెన్నై సూపర్ కింగ్స్ :ఫాఫ్ డు ప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, లుంగి ఎన్‌గిడి

కోల్‌కతా నైట్ రైడర్స్ :శుభమన్ గిల్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్, సునిల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, పాట్ కమిన్స్, నాగర్‌కోటి, వరుణ్ చక్రవర్తి, ప్రసిధ్ కృష్ణ

- Advertisement -