క్యాన్సర్ మహమ్మారిని నిర్మూలిద్దాం: కోలేటి దామోదర్

391
koleti daodhar
- Advertisement -

ఈనాటికి మానవ మేధస్సుకు లొంగని రోగాలలో క్యాన్సర్ మహమ్మారి ఒకటి. ఈ రోగం ముదిరితే, దీనికి మందులు లేవు. ప్రాథమిక దశలో అయితే తగ్గించగలమని వైద్యులు అంటున్నారు. విషయమేమిటంటే, ఈ రోగం ముదిరితే గానీ బయటపడదు. ప్రాథమిక దశలో వ్యాధిని కనుక్కోగలిగితే అది అదృష్టమే. లేకపోతే చేయగలిగేది ఏమీ లేదు. డబ్బు ఖర్చు తప్ప. ఈ వ్యాధి మన దేశంలో పూర్వం ఇంతగా లేదు. గత మూడు నాలుగు దశాబ్దాలుగా వ్యాధి బాగా వ్యాపిస్తుంది. మన దేశంలో రోగాల ద్వారా సంభవించే మరణాలలో క్యాన్సర్ రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నది. దీన్ని బట్టి ఈ వ్యాధి తీవ్రత మన దేశంలో ఎంతగా వుందో గ్రహించవచ్చు. పూర్వం మన దేశంలో ఈ వ్యాధి చాలా అరుదుగా వచ్చేది. ఇప్పుడు ఇంతగా వ్యాప్తి చెందడానికి కారణాలేమిటి? అంటే అది మన జీవన విధానంలో వచ్చిన మార్పులే అని చెప్పక తప్పదు. ఆధునికత తెచ్చిన ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాలకు పెనుముప్పుగా మారాయి.

మన పూర్వీకులు తిన్న ఆహారాన్నే మనం తింటే మనకు ఏ జబ్బులు వుండవన్నది నిర్వివాదాంశం. మన పూర్వీకుల మాదిరి మనం మన చేలలో పండిన పంటలను వండుకు తినడం లేదు. గ్లోబలైజేషన్ మూలంగా మన వంటింట్లోకి కార్పొరేట్ ఫుడ్ ప్రవేశిస్తున్నది. నూడుల్స్, పిజ్జాలు, బర్గర్లు, ఇతర ఇన్-స్టంట్ ఆహారాలన్నీ క్యాన్సర్ కారకాలే అని వైద్య శాస్త్రం చెబుతున్నది. బాగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తినిడం మూలంగా వంద శాతం క్యాన్సర్ బారిన పడే అవకాశం వుంది. బిస్కట్లు, కేకులు, ఆలు చిప్స్, కుర్ కురేలు, బేకరీలలో తయారయ్యే అన్ని ఆహార పదార్థాలు క్యాన్సర్ కారకాలే. అదే విధంగా కోకా కోలా, తమ్స్ అప్, పెప్సీ వంటి కూల్ డ్రింకులు త్రాగే వారికి క్యాన్సర్ తప్పనిసరిగా వస్తుంది. మనం రోజూ తినే వాటిలో ఐదింటిని వైద్యులు విషాహారాలుగా తేల్చారు. వాటిని “వైట్ పాయిజన్స్” అంటున్నారు. అవి పాలిష్ చేసిన తెల్ల బియ్యం , చక్కెర, శుద్ధి చేసిన ఉప్పు, మైదా, బొంబాయి రవ్వ. ఇవి లేకుండా ఈ రోజున మనకు రోజు గడుస్తున్నదా? ఇవే మనకు క్యాన్సర్ రోగాన్ని తెచ్చిపెడుతున్నాయి.

రోజూ మనం త్రాగే పాలు, పళ్ళు కూడా విషతుల్యమైపోయాయి. పాలను కత్తీ చేయడమే కాక, ఎక్కువ పాలు రావడానికి బర్రెలకు “ఆక్సిటోసిన్” ఇంజక్షన్ చేస్తున్నారు. ఇది హర్మోన్ ఇంజక్షన్. ఈ పాలు త్రాగినవారికి కూడా హార్మోన్ల సమతుల్యత దెబ్బ తింటుంది. పండ్లు త్వరగా మగ్గడానికి కార్బైడ్ వంటి రసాయనాలు వాడుతున్నారు. ఇవన్నీ క్యాన్సర్ కారకాలే. ఈ విషయాన్ని కొంత కాలం కిందట రాష్ట్ర హైకోర్ట్ తీవ్రంగా పరిగణించి తగు చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే, ముందుగా మన ఆహారపు అలవాట్లను వెంటనే మార్చుకొని పూర్వ పద్ధతిలో “అమ్మచేతి వంట” తినాలి. వంటలలో చక్కెర మానేసి బెల్లం వాడాలి. పాలిష్ బియ్యం బదులు ముడి బియ్యం తినాలి. తెల్లగా మెరిసే కార్పొరేట్ కంపెనీల ఉప్పుకు బదులు సముద్రపు రాళ్ళ ఉప్పునే వాడాలి. మైదా పిండిని, మైదా పిండితో తయారయ్యే ఆహార పదార్థాలను అంటే సేమియా, నూడుల్స్, బిస్కట్లు, బ్రెడ్, రస్కులు మొదలైన జంక్ ఫుడ్ తినడం పూర్తిగా ఆపివేయాలి. ఉప్మాకు, బొంబాయి రవ్వకు బదులు గోధుమ రవ్వను వాడుకోవాలి. కూల్ డ్రింకులు విషతుల్యం. వాటిని త్రాగటానికి భయపడాలి. మానవ శరీరానికి పది రోజులలో ఎంత చక్కెరనైతే తీసుకునే సామర్థ్యం వుందో, అంత చక్కెర ఒక కూల్ డ్రింక్ సీసాలో ఉంటుంది. కూల్ డ్రింక్ రూపంలో మన శరీరంలోకి చక్కెర అనబడే విషాన్ని అంత పెద్ద మొత్తంలో పంప్ చేస్తున్నామన్న మాట. ఈ విషయాన్ని ఏ కార్పొరేట్ కంపెనీలు చెప్పవు. వారి వ్యాపారాలు వారికి ముఖ్యం. అమెరికా వంటి దేశాలలో ఈ కూల్ డ్రింకులను ఎప్పుడో నిషేధించారు. ఈ కంపెనీలవారు ఇక్కడ నెలకు వందల, వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు.

ప్రఖ్యాత బయో-కెమిస్ట్ రేమాండ్ ఫ్రాన్సిస్ వ్రాసిన “నెవర్ ఫియర్ క్యాన్సర్ అగైన్” అనే పుస్తకంలో చక్కెర గురించి దిగ్ర్భాంతి కరమైన విషయాలు వ్రాశారు. అవి – మనం జీవితంలో ఎప్పుడూ జబ్బుపడకుండా ఉండాలంటే చక్కెర తీసుకోకుండా వుంటే చాలు. కేవలం ఒక్క టీ స్పూన్ చక్కెర తీసుకుంటే అది రెండు గంటల్లో మన దేహంలో అన్ని సహజమైన జీవ రసాయన చర్యలలోనూ ఇంబ్యాలెన్స్ కలగజేస్తుంది. మన దేహంలో అనేక ముఖ్యమైన ఆర్గాన్స్ ను పనిచేయకుండా చేస్తుంది. ఆ విధంగా ఆర్గాన్స్ అన్నీ బలహీనమైపోతాయి. దానితో మన వ్యాధినిరోధక సామర్థ్యం యాభై శాతం తగ్గుతుంది. ఈ లెక్కన ఏదైనా వ్యాధికారక క్రిములతో మనకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదాలు పెరుగుతాయి. ఒక టీ స్పూన్ చక్కెర తోనే ఇంత ప్రమాదం ఉంటే ఒక కూల్ డ్రింక్ లో పది నుంచి పన్నెండు స్పూన్ల చక్కెర ఉంటుంది. అటువంటప్పుడు అదెంత ప్రమాదకరమో ఆలోచించండి అంటారు రేమాండ్ ఫ్రాన్సిస్. చక్కెర మూలంగా శరీరంలో చెడు కొలెస్టాల్ పెరుగుతుంది. గుండె జబ్బులు వస్తాయి. ఊబకాయం వస్తుంది. రక్తపోటు పెరుగుతుంది. కడుపులో అల్సర్లు వస్తాయి.

కేరళకు చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ డా. పి.వి. గంగాధరన్ తో పాటు చాలా మంది క్యాన్సర్ డాక్టర్లు ఏమి చెబుతున్నారంటే – “మీరు చక్కెరకు దూరంగా ఉండగలిగితే చాలు. క్యాన్సర్ కణం దానంతట అదే నశిస్తుంది”. ప్రతి రోజూ గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ పిండుకుని త్రాగండి. అది కీమో తెరపి కంటే వెయ్యి రెట్లు సమర్థవంతంగా పనిచేస్తుందని “మేరీ ల్యాండ్ కాలేజీ” నిపుణుల అధ్యయనంలో తెలిసిన వాస్తవం. తీయదనం కోసం చక్కెరకు బదులు మనకు ప్రకృతి ప్రసాదించిన బెల్లం, తేనె, పండ్లు తినాలి. తాటి బెల్లం ఇంకా మంచిది. ఎండబెట్టిన ఖర్జూరాలను పొడి చేసి తియ్యదనం కోసం వాడుకోవచ్చు.

పసుపును, ఎల్లిపాయ (వెల్లుల్లి)ను, అల్లాన్ని క్యాన్సర్ క్రిమి సంహారకాలుగా మన ఆయుర్వేద శాస్త్రం వేల సంవత్సరాల క్రితం గుర్తించింది. నాగరికత పేరుతో మనం పసుపును, ఎల్లిపాయను, అల్లాన్ని వాడడం తగ్గించి వేశాము. దీని వల్లనే మన ఆరోగ్యాలు చేడుతున్నాయి. ప్రతి నిత్యమూ అల్లం, వెల్లుల్లి, పసుపు తినే వారికి ఏ రోగాలూ ఉండవు. పసుపు పొడి, కారం పొడి ప్యాకెట్లు ఎట్టి పరిస్థితిలోను వాడరాదు. అవి ఎంత ప్రఖ్యాతి చెందిన బ్రాండ్లు అయినా సరే, అవన్నీ కృత్రిమ రంగులు, రసాయనాలతో తయారైన పొడులు. నిజమైన పసుపు, కారాలు కానే కావు. పసుపు కొమ్ములు, మిరపకాయలు తెచ్చుకొని, శుభ్రం చేసుకొని మనం మర పట్టించుకున్నవే నిజమైన పసుపు, కారాలు. అలాగే గోధుమ పిండి ప్యాకెట్లు కొనరాదు. వాటిలో పురుగు పట్టకుండా నిల్వ ఉండేందుకు క్రిమిసంహారక మందులు కలుపుతున్నారు. గోధుమలు తెచ్చుకుని, శుభ్రం చేసుకుని, పిండి పట్టించుకుని, పొట్టును జల్లెడ పట్టి తీసివేయకుండా, వాడుకోవాలి. ఈ రకంగా చేస్తే డాక్టర్ తో పనిలేదు. మన సంప్రదాయ ఆహార పదార్థాలైన జొన్నలు, రాగులు, సజ్జలు వంటి వాటిని వంటలలో అధికంగా వాడాలి. వంటకు రిఫైన్డ్ నూనెలు వాడరాదు.

మామూలు గానుగ నూనెలే వాడాలి. ఈ మధ్య మైసూర్ కు చెందిన ఖాదర్ వలి అనే శాస్త్రవేత్త చిరుధాన్యాలను బాగా ప్రచారంలోకి తెస్తున్నారు. కొర్రలు, సామలు, అరికలు, ఊదలు, అండు కొర్రలు – ఈ ఐదు రకాల చిరుధాన్యాలను రెండు రోజులకు ఒకటి చొప్పున వండుకు తింటే, డయాబెటిస్, క్యాన్సర్ వంటి అలవికాని రోగాలు కూడా తగ్గుతాయని ఆయన భరోసా ఇస్తున్నారు. ఆయనకు అంతర్జాతీయంగా మంచి పేరు వచ్చింది. ఆయన ఉపన్యాసాలను “యు-ట్యూబ్” లో వినవచ్చు. ఈ చిరుధాన్యాలను సేంద్రియ పద్ధతిలో అందుబాటులోకి తేవడంతో పాటు, రైతులకు సేంద్రియ వ్యవసాయంలో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్న “రైతునేస్తం” పత్రిక అధిపతి శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర్ రావుకు గత సంవత్సరం భారత ప్రభుత్వం “పద్మశ్రీ” ని ప్రకటించింది.

కొంత కాలం క్రిందట దినపత్రికలలో ఒక వార్త వచ్చింది. రేషన్ సరుకులు వస్తున్నాయని సంప్రదాయ ఆహారానికి స్వస్తి చెప్పిన కేరళలోని కొన్ని ఆదివాసీ తెగల వారికి గత మూడు దశాబ్దాలుగా ఎప్పుడూ లేని రోగాలు వస్తున్నాయట. దీనికి కారణం ఏమిటని పరిశోధించిన శాస్త్రవేత్తలకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆదివాసీలు తరతరాలుగా సాగు చేస్తున్న ధాన్యాలకు వారు దూరం కావడమే అని తెలిసింది. ఇది తెలుసుకున్న ఆదివాసీ పెద్దలు గత మూడేళ్ళలో
మళ్ళీ వారి పాత పద్ధతిలోకి వచ్చి 25 రకాల అంతరించిపోతున్న వంగడాలను సేకరించి ఇప్పుడు సేద్యం చేస్తున్నారు. అవి తింటున్న ఆదివాసీలకు మళ్ళీ ఆరోగ్యాలు కుదుటపడుతున్నాయి. అంతరించిపోతున్న వంగడాలకు పునరుజ్జీవనం కల్పించిన ఈ ఆదివాసీ రైతులకు కేంద్ర వ్యవసాయశాఖ ప్రత్యేక పురస్కారంతో పాటు 10 లక్షల రూపాయల బహుమతిని అందించింది. కేరళ రాష్ట్ర వ్యవసాయ శాఖ వారు కూడా అవార్డు ఇచ్చి వీరిని అత్యుత్తమ ట్రైబల్ కాలనీగా గుర్తించారు.

దినపత్రికలలోనే వచ్చిన మరొక వార్త – పాకిస్తాన్ లోని హుంజా ప్రాంతంలో నివసిస్తున్న “బురుషా” ఆదివాసీ తెగవారికి క్యాన్సర్ వంటి రోగాల సమస్య లేదు. అసలు అవంటేనే వారికి తెలియదు. 70 ఏళ్ళు వచ్చినా వారు యౌవనంగా వుంటారు. 60 ఏళ్ళు దాటిన స్త్రీలు కూడా ఆరోగ్యవంతమైన శిశువులకు జన్మనిస్తారు. వీరి సగటు వయస్సు 100 ఏళ్ళు. గడ్డకట్టే చలిలో కూడా చన్నీళ్ళతో స్నానం చేస్తారు. వ్యాయామానికి, నడకకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వీరి ఆరోగ్య రహస్యం ఏమిటంటే, స్వయంగా పండించుకున్న తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలతో పాటు ప్రోటీన్లు ఉన్న పాలు, గ్రుడ్లను మాత్రమే వీరు తింటారు. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ముట్టరు. ఆప్రికట్ పండ్లను ఇష్టంగా తింటారు. నదులలోని స్వచ్చమైన నీటిని త్రాగుతారు. ప్రత్యేక మూలికలతో తయారుచేసే “తుమురు” అనే “టీ” త్రాగుతారు. సంవత్సరంలో రెండు మూడు నెలల పాటు మామూలుగా తినే ఆహారానికి విరామం ఇచ్చి “ఆప్రికాట్” పండ్ల నుంచి తీసిన రసం మాత్రమే త్రాగుతారు. ఇదే వారి ఆరోగ్య రహస్యం. దీనిని బట్టి మనం నాగరికత పేరుతో మన ఆహారపు అలవాట్లను మార్చుకుని మన వినాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నామని గ్రహించవచ్చు.
బీజింగ్ ఆర్మీ జనరల్ హాస్పిటల్ కు చెందిన ప్రొఫెసర్ చెన్ హ్యూ రెన్ పరిశోధనలో క్యాన్సర్ కు చెందిన ఒక విషయం తెలిసింది. కాకరకాయలో క్యాన్సర్ కారక ఔషధం ఉంది. రెండు, మూడు కాకరకాయ ముక్కలను ఒక గ్లాస్ లో వేసి అందులో వేడినీటిని పోయాలి. అప్పుడది అల్కలిన్ వాటర్ గా మారుతుంది. దీనిని ప్రతి రోజు త్రాగవచ్చు. ఇది క్యాన్సర్ నిరోధకంగా క్యాన్సర్ ల పై ఇది మంచి ప్రభావం చూపుతుంది. ఇద ప్రకృతి వైద్యంలో ఒక క్రొత్త ఆవిష్క రణ. ఈ వ్యాసాన్ని చదవిన వారు, క్యాన్సర్ నిరోధానికి పైన తెలిపిన సూచనలను తాము పాటించడమే కాక, తమ బంధువులకు, స్నేహితులకు కూడా తెలియజేస్తే క్యాన్సర్ వ్యాధి మన దేశం నుంచి అతి త్వరలో కనుమరుగవుతుంది.

- Advertisement -