గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించండి: గవర్నర్‌తో కోలేటి

260
koleti damodhar
- Advertisement -

గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సైని కోరారు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్. ఇవాళ ఉదయం రాజ్ భవన్ లో గవర్నర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి, మొక్కను అందజేసి, గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించవసిందిగా కోరారు.

చెట్లే మన మనుగడకు పట్టుగొమ్మలని ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు తెలంగాణ అంతటా పచ్చదనం నింపాలనే ఆశయంతో “హరితహారం” కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన చేపట్టారని అన్నారు. ఇటువంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం చేపట్టే ఆలోచన భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదని ఆయన అన్నారు. దేశ సంపద పెంపొందించడానికి ఖనిజ సంపద, జల సంపద ఎంత అవసరమో, వన్య సంపద కూడా అంతే అవసరమని ఈ విషయాన్ని ఎంతో దూరదృష్టితో గ్రహించిన మాన్య ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ‘హరిత తెలంగాణ’ గా మార్చడానికి కంకణం కట్టుకున్నారని అన్నారు. ఈ హరితహారం కార్యక్రమం మూలంగా తెలంగాణ రాష్ట్రమంతా పచ్చని చెట్లతో నిండి ప్రకృతి శోభతో అలరారాలనేది ముఖ్యమంత్రి రి ధ్యేయమని దామోదర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి మరింత బలం చేకూర్చే విధంగా గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు “గ్రీన్ ఛాలెంజ్” పథకాన్ని ప్రారంభించారని, ఈ పథకం క్రింద ప్రతి ఒక్కరూ మూడు మొక్కలను నాటి, మరొక ముగ్గురికి ఈ ఛాలెంజ్ ని అందివ్వాలని, ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన వారు కూడా తలా మూడు మొక్కలను నాటి ఒక్కొక్కరూ మరో ముగ్గురికి ఈ ఛాలెంజ్ ను అందివ్వాలని దామోదర్ అన్నారు.

ఈ రకంగా కొంత కాలానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములవుతారని, ఈ పథకం బాగా విజయవంతమైందని, ఇప్పుడు ఇందులో రాష్ట్రంలోనే కాక యావద్దేశంలోని ప్రముఖులు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు, హైకోర్ట్ న్యాయవాదులు, కేంద్ర మంత్రులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, ప్రముఖ సినీ నటీనటులు, దర్శకులు, ప్రొడ్యూసర్లు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీ ప్రముఖులు పాల్గొని “గ్రీన్ ఛాలెంజ్ ” ను స్వీకరిస్తున్నారని, తిరిగి వారి మిత్రులకు ఈ ఛాలెంజ్ ని యిస్తున్నారని, ఇందుకుగాను మనమంతా శ్రీ సంతోష్ కుమార్ గారిని అభినందించాలని దామోదర్ అన్నారు.

ఇందులో భాగంగానే ఈనాడు తాను రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి “గ్రీన్ ఛాలెంజ్” ను స్వీకరించవలసినదిగా అభ్యర్థించానని, గవర్నర్ గారి స్పూర్తితో మరెందరో ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగస్వాములవుతారని, ఆ విధంగా అతిత్వరలోనే తెలంగాణ రాష్ట్రం “హరిత తెలంగాణ ” గా రూపొంది, మాన్య ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు గారి ఆశయం నెరవేరుతుందని దామోదర్ అన్నారు.పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మరియు ఢిల్లీలో, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని “గ్రీన్ ఛాలెంజ్” ని అమలు చేయడం ఎంతో అభినందించదగ్గ విషయం అన్నారు.

koleti damodhar

- Advertisement -