నో పార్కింగ్‌లో బండి నిలిపిన హీరో..!

358
sushanth
- Advertisement -

అల వైకుంఠపురములో కీ రోల్ తర్వాత యువ కథానాయకుడు సుశాంత్ హీరోగా దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ .నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని రొమాంటిక్ థ్రిల్లర్‌గా సినిమా తెరకెక్కుతుండగా ఏఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ పతాకాలపై రవి శంకర్ శాస్త్రి, హరీష్ కోయిల గుండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక ఇవాళ సుశాంత్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేక వీడియోని రూపొందించారు. ఈ వీడియోలో కొత్తగా కొన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను నడుపుకుంటూ వచ్చి నోపార్కింగ్ బోర్డు ముందు ఆపడం చూపించారు.

ఈ సినిమాలో సుశాంత్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

- Advertisement -