రోహిత్ శర్మ విశిష్ట కెప్టెన్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా విజయం సాధించడంతో రోహిత్ కు ఈ అవకాశం దక్కింది. వెన్నునొప్పి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి టీ20కి దూరమైన సంగతి తెలిసిందే.
దీంతో రోహిత్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. టోర్నీలో భారీ స్కోర్లతో రోహిత్ రాణించనప్పటికీ వనరులన్నీ ఉపయోగించుకుని జట్టును విజయతీరాలకు చేర్చాడు.
దీంతో కెప్టెన్సీ చేపట్టిన మ్యాచ్ తోనే సిరీస్ కైవసం చేసుకున్న కెప్టెన్ల జాబితాలో చేరాడు రోహిత్ శర్మ. అలాగే కెప్టెన్సీ చేసిన తొలి నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించిన మిస్బావుల్ హక్, షాహిద్ అఫ్రిది, సర్ఫరాజ్ అహ్మద్, కుమార సంగక్కర, లసిత్ మలింగల సరసన రోహిత్ శర్మ స్థానం సంపాదించుకున్నాడు.
గత డిసెంబర్లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో తొలిసారి రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టగా, ఆ సిరీస్ ను టీమిండియా 3-0తో గెలుచుకుంది.