కోహ్లీ తర్వాత కేఎల్ రాహులే…!

511
kl rahul
- Advertisement -

భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ టీ20ల్లో అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. ఈనెల 6(రేపు) ఉప్పల్ వేదికగా భారత్ – వెస్టిండీస్ మధ్య జరిగే తొలి టీ20ల్లో 26 పరుగులు చేస్తే పొట్టి క్రికెట్‌ ఫార్మాట్‌లో వేగంగా 1000 పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు.

ఇప్పటివరకు ఆరుగురు భారత క్రికెటర్లు మాత్రమే వెయ్యిపరుగుల మైలురాయిని అందుకోగా కెప్టెన్ కోహ్లీ 27 ఇన్నింగ్స్‌లోనే వెయ్యి పరుగుల మార్క్‌ను అందుకున్నారు.

టీ20 కెరీర్‌లో 31 మ్యాచ్‌లాడిన కేఎల్ రాహుల్ 28 ఇన్నింగ్స్‌లో 974 పరుగులు చేశారు. భారత్ తరఫున టీ20ల్లో 1,000 పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ (2,539) టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత విరాట్ కోహ్లి (2,450), మహేంద్రసింగ్ ధోని (1,617), సురేశ్ రైనా (1,605), శిఖర్ ధావన్ (1,504), యువరాజ్ సింగ్ (1,177) ఉన్నారు.

- Advertisement -