దేశవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో పునరావాస కార్యక్రమాల కోసం ఉద్దేశించిన పీఎం-కేర్స్ ప్రత్యేక నిధికి ఎంపీల్యాడ్స్ నుంచి కోటి రూపాయలతోపాటు, తన ఒకనెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి బుధవారం ప్రకటించారు. 2020-21 సంవత్సరానికి ఎంపీ ల్యాడ్స్ నిధులనుంచి ఆ కోటి రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షలను., తన పార్లమెంటరీ నియోజకవర్గమైన సికింద్రాబాద్‌లో కరోనా సహాయ కార్యక్రమాలకోసం మరో రూ.50లక్షలను కూడా ఇస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన లేఖలను ఎంపి లాడ్స్ కమిటీ ఛైర్మన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , హైదరాబాద్ కలెక్టర్‌లకు పంపించారు.
ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు కూడా తమకు తోచినంత మొత్తాన్ని పీఎం-కేర్స్ నిధికి విరాళాల రూపంలో అందజేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విజ్ఞప్తి చేశారు.
Doing my bit in this fight against #COVID19, I have contributed the following to PM-CARES
₹1 crore from my MPLADS
1 month salary
&
₹50Lakhs to TelanganaCMRF
₹50Lakhs I have kept at the disposal of the Hyd DC to carry out activities against #coronavirus within my constituency pic.twitter.com/mcuWKuBQN7— G Kishan Reddy (@kishanreddybjp) April 1, 2020