మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ వేసి భారీ సెట్‌లో రేపటి నుంచి రవితేజ, మీనాక్షి చౌదరిలపై పాటను చిత్రీకరించనున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ పాటను రూపొందిస్తున్నారు. ఇక మరొక పాటకు సంబంధించిన షూటింగ్ మాత్రం మిగిలి ఉంది. టాకీ పార్ట్ ఇది వరకే పూర్తి కాగా.. ఈ డిసెంబర్ చివరి కల్లా షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ముందుగా ప్రకటించినట్టుగానే ఖిలాడీ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లోకి రానుంది.
బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రెండు పాటలు ఇప్పటికే విడుదల కాగా.. విశేషమైన స్పందన లభించింది.
సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తున్నారు. నటీనటులు: రవి తేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి, అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ భరద్వాజ్
సాంకేతిక బృందం
కథ, కథనం, దర్శకత్వం: రమేష్ వర్మ
నిర్మాత: సత్యనారాయణ కోనేరు
బ్యానర్: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్
ప్రొడక్షన్: ఏ హవీష్ ప్రొడక్షన్
సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గద
సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫర్: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు
స్క్రిప్ట్ కో ఆర్టినేషన్: పాత్రికేయ
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు అరివు
డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, సాగర్
లిరిక్స్: శ్రీ మణి
స్టిల్స్: సాయి మాగంటి
మేకప్: ఐ శ్రీనివాసరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి
ప్రొడక్షన్ హెడ్: పూర్ణ కండ్రు
పబ్లిసిటీ: రామ్ పెద్దిటి సుధీర్
కో డైరెక్టర్: పవన్ కేఆర్‌కే
ఆర్ట్: గాంధీ నడికుడికర్
పీఆర్ఓ : వంశీ – శేఖర్