తెలుగు టైటాన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా చైతూ..

97
chaitu

ప్రొ కబడ్డీ లీగ్ 8వ సీజన్‌కు రంగం సిద్ధంమైంది. డిసెంబర్ 22న బెంగళూరు వేదికగా ప్రొ కబడ్డీ కొత్త సీజన్ ప్రారంభం కానుండగా తెలుగు టైటాన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు చైతన్య.

దీనికి ప్రో కబడ్డీకి సంబంధించి లే పంగా అంటూ నాగ చైతన్య చేసిన వీడియోను రానా దగ్గుబాటి విడుదల చేశారు. అందులో జెర్సీ మాత్రమే కాదు కవచమది… గ్రౌండ్ మాత్రమే కాదు పోరాట స్థలమది… ఆయుధాలు లేకుండా జరిగే ఈ అత్యుత్తమ యుద్ధంలో తెలుగు టైటాన్స్ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు.రా.. చూద్దాం! డిసెంబర్ 22 నుంచి ప్రో కబడ్డీ అంటూ పేర్కొన్నారు.

తెలుగు టైటాన్స్ జట్టులో అద్భుతమైన డిఫెండర్లు, రైడర్లు… బాహుబలి, సిద్ధార్థ్ దేశాయ్, రోహిత్ కుమార్, విశాల్ భరద్వాజ్ వంటి బలమైన ఆటగాళ్లు ఉన్నారు.