దాదాపు 9 సంవత్సరాల తర్వాత వెండితెరపై అలరించేందుకు సిద్ధమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు ఖైదీగా రాబోతున్నాడు చిరు. సినిమా సాంగ్స్ నుంచి ట్రైలర్ వరకు టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన ఖైదీ…చిరు మానియాను చాటిచెప్పింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ చిరు చెప్పిన డైలాగ్‌లకు అభిమానులు ఫిదా అయిపోయారు.
సినిమా పై భారీ అంచనాలను పెట్టుకున్న అభిమానులకు మరో శుభవార్త.ప్రపంచ వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో విడుదల కానున్న నేపథ్యంలో యుకే..యుఏఈ సెన్సార్ బోర్డు సభ్యుడు ఇచ్చిన రేటింగ్‌తో అభిమానులు పండగ చేసుకుంటు్ననారు. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సందు ఖైదీకి 4/5 రేటింగ్ ఇచ్చి సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు.
సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు అభిమానులకు అద్యంతం అలరించడం ఖాయమని తెలిపాడు. మూవీలోని ఫస్టాఫ్,సెకండాఫ్ అద్భుతంగా వచ్చాయని….తెరపై చిరుని చూస్తే మైండ్ బ్లోయింగేనన్నాడు. ఇక చిరంజీవి పలికే డైలాగులకు థియేటర్లు మార్మోగిపోనున్నాయని చెప్పాడు. వివి వినాయక్ దర్శకత్వం సింప్లీ సూపర్బ్ అని కొనియాడాడు.వినాయక్ ను మాస్ డైరెక్టర్ అని ఎందుకంటారో ఈ మూవీ చూస్తే తెలుస్తుందన్నాడు.
చిరంజీవిని ఏ రకంగా చూపిస్తే అభిమానులు ఇష్టపడుతారో వినాయక్ అంతకుమించి చూపించారన్నాడు. ఇక మూవీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓ మెట్టు పైకి తీసుకెళ్లిందని, దేవిశ్రీ ప్రసాద్ పాటలు సినిమాకు చాలా హైలెట్‌గా నిలుస్తాయని తెలిపాడు. సంక్రాంతికి ఫుల్ పైసా వసూల్ మూవీ ఖైదీ నెంబర్ 150 అని చెప్పాడు.