ఇంకా ఇరవై ఏండ్లు రాజకీయాల్లో ఉంటాను అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన రేవంత్… నేను చట్టప్రకారమే నడుచుకుంటాను..అరెస్టులు చేయమని డిమాండ్ వస్తోందని అరెస్ట్ చేయలేను అన్నారు.
నేను కమిట్మెంట్ ఇస్తే చేసి తీరుతా.. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పాను. ఇప్పించాను అన్నారు. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకపడ్డాం..
స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం..ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నాం అన్నారు.
ఇక మరోవైపు జానారెడ్డి ఇంటికి వెళ్లారు సీఎం రేవంత్. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో చర్చించారు సీఎం. నిన్న సీఎం రేవంత్ తో శాంతి చర్చల కమిటీ తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. కాల్పుల విరమణ, శాంతిచర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటామని తెలిపారు సీఎం రేవంత్.
Also Read:పాక్ యూ ట్యూబ్ ఛానెల్స్ బ్యాన్

