కేజీఎఫ్‌ నిర్మాత సంచలన ప్రకటన..

49
- Advertisement -

నూతన సంవత్సరం సందర్భంగా కేజీఎఫ్‌ నిర్మాతలు సంచలన ప్రకటన చేశారు. రానున్న ఐదేళ్ల కాలంలో రూ. 3 వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రకటించింది. గ‌త ఏడాది కేజీఎఫ్ 2, కాంతార చిత్రాల‌తో ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది హోంబ‌లే ఫిలింస్‌.

క‌ర్ణాట‌క‌కు చెందిన ఈ ప్రొడ‌క్ష‌న్ హౌస్ పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మిస్తోంది. రానున్న 5 ఏళ్ల కాలంలో సినీ రంగంలో మూడు వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు పెట్ట‌బోతున్న‌ట్లు హోంబ‌లే ఫిలింస్ అధినేత విజ‌య్ కిర‌గందూర్ ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్ నుండి లైన్లో ఉన్న సినిమాలను పరిశీలిస్తే… ప్రభాస్ నటించిన సలార్‌తో పాటు పృథ్వీ రాజ్ కుమార్ – టైస‌న్‌,రక్షిత్ శెట్టి – రిచ‌ర్డ్ ఆంటోని, ఫ‌హ‌ద్ ఫాజిల్ – ధూమ‌మ్‌,శ్రీముర‌ళి – భ‌గీర‌,కీర్తి సురేష్ – రగుతాత‌,య‌ష్ – కెజియ‌ఫ్ 3 తో పాటు కాంతార 2 సినిమాలు లైన్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -