తిరుమల అప్‌డేట్..

35
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ ఏకాదశి శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా రావడంతో హుండీ ఆదాయం రికార్డు స్ధాయిలో నమోదైంది. ఒక్కరోజే హుండీ ద్వారా రూ. 7.68 కోట్ల ఆదాయం వచ్చింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం శ్రీవారిని 69,414 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 18,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి. ఈ నెల 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుండడంతో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 28న శ్రీవారి రథసప్తమి వేడుక వైభవంగా జరగనుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -