ఇళ్ల ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు నిర్మలా సీతారామన్. లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా మాట్లాడిన నిర్మలా ఆదర్శ అద్దె విధానం త్వరలోనే అమలు చేస్తామన్నారు.భారతమాల, సాగర్‌మాల, ఉడాన్ పథకాలతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయని చెప్పారు.
ఎంఆర్‌వో అంటే తయారీ, మరమ్మత్తు, నిర్వహణ విధానాన్ని పూర్తిగా అమలు చేస్తామన్నారు.ఒకే కార్డుతో బస్ ఛార్జీలు, పార్కింగ్ రుసుములు చెల్లించే విధంగా ఒకే కార్డుకు రూపకల్పన చేస్తున్నామన్నారు.
మినిమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నన్స్ మా విధానం. పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.కోటి వరకూ రుణ సదుపాయం కల్పిస్తామన్నారు.
గత ఐదేళ్లలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేశాం. పరోక్ష పన్నులు, నిర్మాణ రంగం, దివాళ స్మృతిలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు.దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పారిశ్రామిక రంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
ఒకే దేశం.. ఒకే గ్రిడ్ విధానంలో భాగంగా అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రైల్వేల్లో 50లక్షల కోట్ల పెట్టుబడి అవసరముంది. దీని కోసమే పీపీపీ అమలు చేస్తున్నామన్నారు.మెట్రోరైలు సర్వీసులు పెరుగుతున్నాయి. మరో 300కి.మీ. అనుమతులు లభించాయి. ఇప్పటి వరకూ దేశంలో 657కి.మీ. మెట్రో మార్గం ఉంది.
ప్రధానమంత్రి సడక్ యోజన, ఉడాన్, పారిశ్రామిక కారిడార్, రవాణాకు, రైల్వేలు ఇతర మార్గాలను నిర్మిస్తున్నాం. సాగరమాలతో అనుసంధానం జరుగుతోందన్నారు. ప్రత్యక్ష పన్నులు, రిజిస్ట్రేషన్‌లో అనేక మార్పులు తెచ్చాం. ప్రతి ఇంటికి మరుగుదొడ్ల సౌకర్యం, స్వచ్ఛభారత్ నిర్మితమైంది.