Revanth:సీఎం రేవంత్‌తో కేశవరావు భేటీ

22
- Advertisement -

తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కేశవరావు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ నివాసంలో ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు కేకే. డీసీసీ అధ్యక్షుడు రోహన్ రెడ్డితో పాటు సీఎంను కలిశారు కేకే.

తన కూతురు మేయర్ గద్వాల విజయలక్ష్మీతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు కేశవరావు. తాను బీఆర్‌ఎస్‌ నుంచి సొంతగూటికి చేరుతున్నానని తెలిపారు.  బీఆర్‌ఎస్‌లో తనకు సముచిత గౌరవం దక్కిందని తెలిపారు. అయితే తన కుమారుడు విప్లవ్‌ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని చెప్పాడని వెల్లడించారు.

Also Read:KTR:బీఆర్ఎస్‌ను ప్రజలే కాపాడుకుంటారు

- Advertisement -