రివ్యూ : కేశవ

357
- Advertisement -

రెగ్యులర్ కమర్సియల్ జానర్ కు భిన్నంగా వరుస ప్రయోగాలతో సక్సెస్ లు సాధిస్తున్న యంగ్ హీరో నిఖిల్.  `స్వామి రారా` సినిమాతో ఆకట్టుకున్న నిఖిల్ …`కార్తికేయ‌`, `సూర్య వ‌ర్సెస్ సూర్య‌`,  `ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా` చిత్రాల్లో న‌టించి విజ‌యాల్ని సొంతం చేసుకొన్నారు. క‌థానాయ‌కుడిగా త‌న స్థాయినీ పెంచుకొన్నాడు. తాజాగా కేశవ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు నిఖిల్. ట్రైలర్‌తోనే ఆకట్టుకున్న కేశవ  మరోసారి నిఖిల్ మార్క్ చూపించిందా..? ఈ ప్రయోగంతో నిఖిల్ తన సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేశాడా..? లేదా చూద్దాం..

కథ:

చిన్నతనంలో జరిగిన కారు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన కేశవ (నిఖిల్) అనే కుర్రాడు ఆ ప్రమాదానికి కారణమైన వారిని చంపాలనే పగతో పెరిగి పెద్దై వరుస హత్యలు చేస్తుంటాడు. అది కూడా పోలీస్ ఆఫీసర్లనే కావడంతో వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని పట్టుకోవాలని నిర్ణయించుకుని స్పెషల్ ఆఫీసర్ షర్మిల (ఇషా కొప్పికర్) ను అప్పగిస్తుంది. అలా కేసును టేకప్ చేసిన షర్మిల ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేసింది ? నేరస్థుడు కేశవే అని ఎలా గుర్తించింది ?  కేశవ పోలీసులకు పట్టుబడకుండా తన పగను ఎలా తీర్చుకున్నాడు ? అన్నది తెరమీద చూడాల్సిందే.

review

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ నిఖిల్ నటన,కథనం. ప్రతి సన్నివేశంలోనూ ఎంతో  అనుభవమున్న  నటుడిగా, బాధను దిగమింగుకుంటూ బయటికి సాధారణంగా కనిపించే యువకుడి పాత్రలో నిఖిల్‌ ఒదిగిపోయాడు. కేశవ్‌ పాత్ర తన కోసమే సృష్టించినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ రీతూవర్మ ఆకట్టుకుంది. అందంతో పాటు అభినయంతోనూ మెప్పించింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఇషా కొప్పీకర్, పోలీస్ అధికారి పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. కామెడీకి పెద్దగా స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, సుదర్శన్, సత్యల కామెడీ అలరిస్తుంది. ఇతర పాత్రల్లో అజయ్, బ్రహ్మాజీ, రావూ రమేష్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ మైనస్ పాయింట్స్ రోటిన్ స్టోరీ, స్లో నారేషన్. ఫస్టాఫ్‌. ఫస్టాఫ్ ఆరంభం బాగానే ఉన్నా హీరో హత్యలు చేయడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగడం వంటి సన్నివేశాల్లో కొత్తదనమంటూ ఏం లేదు. దర్శకుడు సుధీర్ వర్మ కథనం విషయంలో కొంచెం ఎక్కువ స్వేచ్చనే తీసుకోవడంతో రొటీన్ అంశాలైన పోలీసులు హీరోను ఆపలేకపోవడం, అతను శిక్ష నుండి తప్పించుకోవడం వంటి అంశాలు మరీ నాటకీయంగా ఉండి తేలిపోయాయి. ట్రైలర్లలో హీరో పాత్ర పరిస్థితుల ప్రభావంతో చాలా వైల్డ్ గా మారుతుందనే అంచనా కలిగించారేగాని తెర మీద మాత్రం హీరో పాత్ర సాఫ్ట్ గానే పోతుంటుంది తప్ప ఎక్కడా తారా స్థాయికి చేరుకోకపోవడం నిరుత్సాహాన్ని కలిగించింది.

review

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులు పడతాయి. ఛాయాగ్రహణం, సంగీతం బాగుంది. సుధీర్‌వర్మ ఒక సాధారణ కథకు తనదైన కథనంతో హంగులు జోడించిన విధానం బాగుంది.  సినిమాను రెండు గంటల లోపే ముగించిన సుధీర్, కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో అనవసరమైన కామెడీ, రొమాంటిక్ సీన్స్ ఇరికించకుండా సినిమాను ఒకే మూడ్ లో నడిపించాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మరోసారి స్పీడందుకోవటం సినిమాకు ప్లస్ అయ్యింది. దివాకర్ మణి సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. తన ఫ్రేమ్స్, లైటింగ్ తో సినిమా మూడ్ ను క్యారీ చేశాడు. ఎడిటింగ్, మ్యూజిక్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు:

హీరో నిఖిల్ చేసిన మరో విభిన్నమైన ప్రయత్నం ‘కేశవ’. హీరో నిఖిల్ నటన, సినిమాటోగ్రఫీ, సెకండాఫ్  సినిమాకు ప్లస్ కాగా రొటీన్ గా ఉన్న ఫస్టాఫ్,బలహీన సన్నివేశాలు సినిమాకు మైనస్ పాయింట్స్ . మొత్తం మీద చెప్పాలంటే ‘బాహుబలి – ది కంక్లూజన్’ తర్వాత ఈ 19వ తేదీ వరకు విడుదలైన అన్ని తెలుగు సినిమాల్లోకి మంచి ఛాయిస్ నిఖిల్ ‘కేశవ’.

విడుదల తేదీ:19/05/2017
రేటింగ్‌:3.25/5
నటీనటులు: నిఖిల్, రితూ వర్మ, ఇషా కొప్పికర్
సంగీతం: సన్నీ యం.ఆర్‌
నిర్మాత‌: అభిషేక్ నామా,వివేక్‌ కూచిభొట్ల  
కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: సుధీర్‌వర్మ

- Advertisement -