తప్పుడు ప్రచారాన్ని ఖండించిన నిఖిల్

21
- Advertisement -

తనపై జరుగుతోన్న తప్పుడు ప్రచారానని ఖండించారు హీరో నిఖిల్. నా ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న వీడియోలను రాంగ్ గా ప్రొజెక్ట్ చెస్తున్నారు అన్నారు. కార్తికేయ 2 సక్సెస్ మీట్ అనంతరం జరిగిన డిన్నర్ పార్టీ వీడియోలని సర్క్యూలేట్ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అక్కడ ఉన్నది కూడా మా కుటుంబ సభ్యులే .. వాస్తవం ఎంటనేది పోలీసులకు కూడా తెలుసు అన్నారు.

వాస్తవానికి గత ఏడాది రాజ్ తరుణ్ , లావణ్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజ్ తరుణ్ భార్యగా, మాజీ ప్రేయసిగా తనకు తాను చెప్పుకుంటున్న లావణ్య.. ఇప్పుడు మస్తాన్ సాయి అనే వ్యక్తి హార్డ్ డిస్క్ ను పోలీసులకు అందజేసింది.

Also Read:Delhi Elections:ఢిల్లీలో కమల వికాసం

ఈ హార్డ్ డిస్క్ లో హీరో నిఖిల్ ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని కూడా ఆమె తెలిపింది. దీంతో ఈ అంశం కాస్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై హీరో నిఖిల్ స్పందించారు.

- Advertisement -