కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య..

190
keesara thasildar
- Advertisement -

చంచల్‌ గూడ జైలులో కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాన్ని అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అవినీతి, లంచం కేసులో నాగరాజు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంచల్‌గూడ జైలులో నాగరాజు రిమాండ్ ఉండగా.. ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రూ. 1.10 కోట్ల లంచం కేసులో నిందితుడిగా ఉన్న ఆయన్ను కొద్దిరోజుల కిందట ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆ కేసులో విచారణ కొనసాగుతుండగానే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. కీసర మండలం రాంపల్లి దయారాలోని 28 ఎకరాల భూమిపై వివాదం నడుస్తుండగా, రియల్ ఎస్టేట్ సంస్థకు అనుకూలంగా పత్రాలు మార్చేందుకుగాను భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేశారు నాగరాజు. దీంతో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు . తహసీల్దారుతో పాటు ఈ వ్యవహారంలో పాల్గొన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఏజెంట్, వీఆర్ఏలను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -