కీర్తి సురేష్ లవర్‌ అతనే!

19
- Advertisement -

మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి సోదరిగా నటిస్తున్న కీర్తి సురేశ్‌కు ప్రియుడిగా సుశాంత్ గెస్ట్ రోల్ చేస్తున్నాడట. అతని కోసం సినిమాలో ఆ పాత్ర నిడివిని పెంచారని టాక్. ఓ పాటలో సైతం సుశాంత్ కనిపిస్తాడని అంటున్నారు. కానీ ఈ విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈనెల 18న సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా అతని లుక్ ను విడుదల చేస్తూ, అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక మెహర్ రమేష్ తో తానూ చేస్తున్న ‘భోళా శంకర్’ సినిమాని కూడా వచ్చే సంక్రాంతికే రిలీజ్ చేయాలని చిరంజీవి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకే మెగాస్టార్ ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. సినిమాలోనే ఈ షేడ్స్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సినిమాలో దర్శకుడు మెహర్ రమేష్ రెండు మాస్ ట్రాక్ లు యాడ్ చేశారు. మాస్ ఎలివేషన్లను మెహర్ రమేష్ చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు.

పైగా మాస్ ఎలివేషన్లలో మెగాస్టార్ చిరంజీవి కూడా అదిరిపోతారు. మొత్తానికి సిస్టర్ సెంటిమెంట్ తో పాటు భారీ యాక్షన్ టచ్ తో ఈ ‘భోళా శంకర్’ రాబోతున్నాడు. మరి ఈ ‘భోళా శంకర్’ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మెగా ఫ్యాన్స్ ఐతే, ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి…

పఠాన్ ఓటీటీలోకి ఎప్పుడంటే..!

ఈ వారం ఓటీటీ సినిమాలివే!

ఆస్కార్‌తో హైదరాబాద్‌లో ఆర్ఆర్ఆర్ టీం..

- Advertisement -