పఠాన్ ఓటీటీలోకి ఎప్పుడంటే..!

24
- Advertisement -

బాహుబలి ప్రభావంతో టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీ దేశంలో మారుమోగింది. దీంతో పాటుగా బాలీవుడ్ కూడా డీలా పడి బాక్సాఫీస్ వద్ద సినిమాలు హిట్‌ లేక విలవిలలాడింది. అమిర్‌ఖాన్‌ నటించిన లాల్‌సింగ్ చడ్డా బాయ్‌కట్‌కు బలైన సంగతి తెలిసిందే. దీంతో భూల్‌ భూలయ్య-2 దృష్యం-3 సినిమాలు పలకరించిన అంతగా బాలీవుడ్‌ను ఆదుకోలేకపోయింది. ఈ సందర్భంలో బాలీవుడ్‌ బాద్‌షా నటించిన పఠాన్ సినిమా సంచలనంగా మారింది. అయితే మొదట్లో ఈ సినిమాకు బాయ్‌కట్‌ సెగ తగిలిన…బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

జనవరి 25న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. షారుఖ్‌ఖాన్‌ యాక్షన్‌, దీపికా అందాలు, జాన్‌ అబ్రహం విలనిజం ప్రేక్షకులను థియేటర్‌లకు రిపీటెడ్‌గా వచ్చేలా చేశాయి. బాహుబలి-2 పేరిట ఉన్న ఐదేళ్ల రికార్డును బద్దలు కొట్టి.. బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన సినిమాగా సంచలనం సృష్టించింది. అయితే ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. కాగా ఈ సినిమా మార్చి 22నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్‌ అబ్రహం కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించాడు.

ఇవి కూడా చదవండి…

ఈ వారం ఓటీటీ సినిమాలివే!

ఆస్కార్‌తో హైదరాబాద్‌లో ఆర్ఆర్ఆర్ టీం..

శబ్దం…కీలకపాత్రలో సిమ్రాన్

- Advertisement -