ఈ వారం ఓటీటీ సినిమాలివే!

19
- Advertisement -

థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలను ఓ సారి పరిశీలిద్దాం..

హిందీ మూవీ కుత్తే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆదిత్య రాయ్ కపూర్, టబు, కొంకణ్ సేన్ శర్మ, నసిరుద్దీన్ షా ముఖ్య పాత్రల్లో నటించారు. కోట్ల నగదుతో వెళ్తున్న వ్యాన్ వెళుతూ ఉంటుంది. ముంబై శివార్లలో రాత్రి వర్షం పడుతుండగా.. మూడు వేరు వేరు గ్యాంగ్స్ ఆ డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తాయి. చివరకు ఎవరు గెలిచారు అన్నదే సినిమా కథ.

డారెన్ అరోనోఫ్స్కీ దర్శకత్వం వహించిన 2022 అమెరికన్ సైకలాజికల్ డ్రామా చిత్రం ‘ది వేల్’. 2012లో శామ్యూల్ డి. హంటర్ రచించిన నాటకం ది వేల్ ఆధారంగా తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ధనుష్ హీరోగా నటించిన సార్‌ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక కలర్‌ ఫోటో సినిమాతో హీరోగా అవతారమెత్తిన సుహాస్‌ నటించిన ‘రైటర్‌ పద్మభూషణ్ ఫిబ్రవరి 3న థియేటర్‌లో రిలీజై సంచలనం విజయం సాధించింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో స్టీమింగ్ అవుతోంది.

అమెజాన్ ప్రైమ్ ..

Congratulations – గుజరాతీ

Class of ’07 – ఇంగ్లిష్

Qodrat – ఇండోనేషియన్

నెట్ ఫ్లిక్స్..

Shadow and Bone Season 2 – ఇంగ్లిష్

Still Time – ఇటాలియన్

సోనీ లీవ్…

Rocket boys Season 2 – హిందీ

ఇవి కూడా చదవండి..

- Advertisement -