- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తికావొచ్చిన ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుండగా ఈ సినిమా తర్వాత మెహర్ రమేశ్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరు.
తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమా రీమేక్‌లో చిరు నటించనుండగా సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు రమేశ్. ఈసినిమాలో హీరో చెల్లెలి క్యారెక్టర్ చాలా ప్రత్యేకంగా ఉండనుంది.
తొలుత ఈ పాత్రకోసం సాయి పల్లవిని అనుకున్న తాజాగా టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహానటి ఫేమ్ కీర్తి సురేష్‌ని తీసుకున్నారని టాక్.ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు గానీ త్వరలోనే అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
- Advertisement -