గోడే ఖీ ఖబర్‌లో డబుల్ బెడ్ రూమ్‌ ఇండ్లు ప్రారంభం..

36
talasani

హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గోడే ఖీ ఖబర్ లో నూతనంగా నిర్మించిన 139 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్దిదారులకు అందజేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. లబ్ధిదారులకు లాటరీ పద్దతి ద్వారా ఇండ్ల తాళాలను అందజేశారు మంత్రి తలసాని.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, హైదరాబాద్ కలెక్టర్ , మున్సిపల్ జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్లు , జి.హెచ్.ఎం.సి అధికారులు , బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.