నితిన్‌పై రీవెంజ్ తీర్చుకుంటా!

92
keerthi suresh

హీరో నితిన్‌-కీర్తి సురేష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం రంగ్‌ దే. ప్రస్తుతం దుబాయ్‌లో చిత్ర షూటింగ్ జరుగుతుండగా ఇటీవెల లోకేషన్‌కి సంబంధించిన ఫోటోని షేర్ చేశాడు నితిన్. షూట్ బ్రేక్‌లో కీర్తి నిద్ర పోతుంటే ఆ పిక్ తీసిన మేము చెమ‌ట‌లు కారుస్తుంటే కీర్తి హ్యాపీగా రిలాక్స్ అవుతుంది అని కామెంట్ పోస్టు చేయగా దీనికి రిప్లై ఇచ్చింది కీర్తి సురేష్.

తప్ప‌కుండా రివేంజ్ తీర్చుకుంటాను. ఇక షూటింగ్ మధ్యలో ఎప్పుడూ నిద్రపోకూడదనే పాఠం నేర్చుకున్నా అంటూ పేర్కొంది కీర్తి సురేష్‌. వీరిద్దరి మధ్య జరిగిన కన్వర్సేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.