ప్రధానితో భేటీ కానున్న సీఎం కేసీఆర్…

212
kcr modi

మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవనున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు ప్రధానితో సమావేశం కానున్న కేసీఆర్ 10 అంశాలను విన్నవించనున్నట్టు సమాచారం. ప్రధానంగా హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థికసాయం, రక్షణశాఖకు చెందిన భూముల కేటాయింపు ,జోనల్ వ్యవస్థ అమోదం వంటి అంశాలను చర్చించనున్నారు.

వీటితో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల విడుదల,కరీంనగర్ లో ట్రిపుల్ ఐటి,కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు అంశాలను ప్రస్తావించనున్నారు.తెలంగాణకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) మంజూరుచేయాలని విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం.

ఇక నిన్న పలువురు కేంద్రమంత్రులను కలిశారు సీఎం కేసీఆర్. హైకోర్టు విభజనను సత్వరం పూర్తిచేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను కోరారు. హైకోర్టు విభజనతోనే రాష్ట్ర విభజన ప్రక్రియ సంపూర్ణమైనట్టు తెలంగాణ ప్రజలు భావిస్తారని స్పష్టం చేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ను కలిశారు సీఎం. రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి నూతన జోనల్ వ్యవస్థ అత్యంత కీలకమైనదని చెప్పారు.