ఊరికే గుడ్డిగా ఓట్లు వేస్తే మన పిల్లల భవిష్యత్ పోతుంది… బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గానికి లాభం జరుగలేదు అన్నారు మాజీ సీఎం కేసీఆర్. దుండిగల్ రోడ్డు షోలో మాట్లాడిన కేసీఆర్…పేదలు, గిరిజనులు, మహిళలు, కార్మికుల కోసం ఓ మంచి చట్టం లేదు. కనీస జీతాలు పెంచాలని చట్టాలు తేలేదు అన్నారు. కానీ పెట్టుబడిదారులకు మాత్రం కాపలాకాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం..ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని ఆరోపించారు. నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా ఢమాల్ అయింది… నీళ్లు లేవు, కరెంటు లేదు.. దీని కారణంగా అంతర్జాతీయంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని పూర్తిగా దెబ్బతింటుందన్నారు. లండన్, న్యూయార్క్ లో కరెంటు పోతదమో కానీ తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చేసి చూయించాం. మేము అధికారంలో ఉన్నప్పుడు భూముల రేట్లు ఎట్లుండే..ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ ట్యాక్స్ వచ్చాక భూముల రేట్లు ఏ విధంగా పడిపోయాయే ప్రజలు ఆలోచించాలి అన్నారు.
హైదరాబాద్‌లో కొద్ది పాటి వాన పడితేనే ఆరు గంటల కరెంటు పోయిన దుస్థితి నగరానికి వచ్చిందన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కార్మింగ్ అనే పరిశ్రమ హైదరాబాద్‌లో వెయ్యికోట్లతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దివాళ కోరు పరిపాలన విధానంతో.. అది చెన్నైకి తరలిపోయిందన్నారు.
Also Read:KCR:నర్సాపూర్‌కు నీళ్లు రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి