తెలంగాణ సీఎం కేసీఆర్ ఏది చేసిన పక్కా ప్లాన్ ఉంటుంది. ఒక్కసారి బరిలోకి దిగారంటే గెలిచేవరకు వెనుకడుగు వేయరు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన దగ్గరి నుండి రాష్ట్ర సాధన వరకు అనేక అవాంతరాలు ఎదురైన కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. తెలంగాణ రాష్ట్ర తొలిముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు జాతీయ రాజకీయాలను సైతం ప్రభావితం చేశాయి. అది కేసీఆర్ ముందుచూపు.
ఓ వైపు పరిపాలనలో తలమనుకలవుతూనే మరోవైపు ప్రజల నాడీని తెలుసుకునేందుకు కేసీఆర్ పలు సందర్భాల్లో సర్వేలు నిర్వహించడం,వాటిని బహిరంగంగానే పబ్లిక్‌కు తెలియజేశారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామన్న దాదాపుగా 88 సీట్లు గెలిచి సత్తాచాటారు. తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబు జోక్యంపై మండిపడ్డ కేసీఆర్..ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు.
ఇందుకు అనుగుణంగానే జగన్‌తో కేటీఆర్ భేటీ అవడం,త్వరలోనే సీఎం కేసీఆర్-జగన్ భేటీ ఉండటంతో కేసీఆర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో సైతం ప్రీ పోల్ సర్వేను నిర్వహించారట. చంద్రబాబును ఓడించే ఉద్దేశంతో రంగంలోకి దిగాలని భావిస్తున్న కేసీఆర్ ప్రస్తుత ఏపీ రాజకీయ వాతావరణం,ప్రజల నాడీని పట్టుకునే ప్రయత్నం చేశారట. ఏపీలో ప్రభుత్వ పథకాలు,టీడీపీ ప్రభుత్వ పనితీరు,ఏ పథకాలు బాగున్నాయి,ఏ పార్టీకి ఓటేస్తారు వంటి అంశాలపై సర్వే నిర్వహించారట.
రెండు నెలల క్రితం కేసీఆర్ నిర్వహించిన ఈ సర్వేలో టీడీపీ,వైసీపీ పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 2.5 శాతం మాత్రమే ఉన్నట్లు తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్‌తో భేటీ తర్వాత కేసీఆర్ సర్వే వివరాలను వెల్లడించనున్నారట. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్..ఇందుకోసం అవసరమైన సలహాలు,సూచనలు ఇవ్వనున్నారట. మొత్తంగా వీరిద్దరి భేటీ జరిగి కేసీఆర్ తన నిర్ణయాన్ని కుండబద్దలు కొడితే ఏపీలో రాజకీయాలు హీటెక్కడం ఖాయమని పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.