సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు సలహాలు సూచనలు చేశారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. “దేశాన్ని ఓ జలగలాగా పట్టిపీడిస్తున్న బీజేపీ ప్రభుత్వం క్రియాహీనమైనటువంటిదని, నిష్క్రియాపరమైనటువంటిదని, అవివేకమైన, అసమర్థమైన పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోదీ ఆయన ప్రభుత్వం వారి జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశాలు అని హైదరాబాద్‌లో పెట్టారు. ఏమిరా అంటే ఏమీ లేదు. ఓ జాతీయ పార్టీ, దేశాన్ని పాలించే పార్టీ కార్యవర్గ సమావేశాలు పెడితే.. దేశమంతా ఎక్స్‌పెక్ట్ చేస్తది. హైదరాబాద్‌లోని మనం కాదు…. ఎంటైర్ కంట్రీ ఎక్స్‌పెక్ట్ చేస్తది ఏం చేప్తారో… గతంలో వాళ్లు సాధించిన విషయాలు ఏకరువు పెట్టి చెబుతరు. ఫలితాలు ఏంటీ ? దేశానికి కలిగిన ప్రయోజనాలు ఏంటీ ? భవిష్యత్‌లో విజన్ ఏంటీ ? ఏం చేయబోతున్నరు జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా జాతికి సందేశం ఇస్తరు కానీ, అటువంటిది ఏమీ లేదు. నథింగ్. ఆ ప్రధాని ఏం మాట్లాడిండో ఆ భగవంతునికి ఎరుక. ఆయన కథ అట్లంటే. ఆయనకు ముందు మాట్లాడిన మంత్రులు కేవలం కేసీఆర్‌ను తిట్టి పోయారు తప్ప.. ఏ విషయంలో ఏం చెప్పినట్లు ఏం లేదు. దాని తర్వాతనన్న ఏమైనా చెబుతున్నరా ? అని నాలుగు ఐదు రోజులుగా చూసిన” అని అన్నారు.
రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి యశ్వంత్ సిన్హా వచ్చారు. అనుకోకుండా కో ఇన్సిడెంట్‌గా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, మా సమావేశం జరిగింది. నేను ప్రధానమంత్రిని కొన్ని ప్రశ్నలు అడిగా. స్పష్టంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా వీటికి సమాధానాలు చెప్పాలని అడిగా. ఆయన అవలంభిస్తున్న అవినీతి విధానాలు, దేశంలో జరుగుతున్న కుంభకోణాలు, బీజేపీ అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రబలుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రజలకు సంబంధించినటువంటి. వీటిపై అడిగినా ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేదు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు.. మంత్రులు గానీ చెప్పలేదు. అంటే ఏం లేదు. సరుకు లేదు.. సంగతి లేదు.. సబ్జెక్ట్ లేదు.. ఆబ్జెక్ట్ లేదు.. శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు.. అంతా డబ్బా.
దేశ ప్రజలు చాలా ఆశించారు కాని వారు చెప్పింది ఏమి లేదు. ప్రజలందరినీ ఆశోపాతులను చేశారు. సరే తెలంగాణకు వారు చేసిందేమీ లేదు. వాళ్ల అయ్యేది ఏమీ లేదు. తెలంగాణ వచ్చిన నుంచి చేసింది ఏమీ లేదు. దేశానికి ఏం చేయాలే.. తెలంగాణకు ఆయింత ఏమీ చేయలేదు. కాబట్టి తెలంగాణకు గురించి చెప్పింది ఏమి లేదు. దేశ ప్రజల పక్షాన మేం లేవనెత్తిన ప్రశ్నలకు గానీ, సమాధానం చెప్పలేము.. మేం అశక్తులం అని వారికి వారే వారి డొల్ల తనాన్ని బయట పెట్టుకొనిపోయారు. దేశ ప్రగతికి సంబంధించినటువంటి గంభీరమైనటువంటి ఒక అవగాహన వ్యూహం, ఓ దార్శనితక పత్రం కూడా విడుదల చేయలేదు.. ఏం లేదని బీజేపీ రుజువు చేసుకున్నది.
వాస్తవానికి సులభంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. నేను అడిగినా యశ్వంత్ సిన్హా సభలో.. ఏ దేశంలో పతనం కానీ రూపాయి.. భారత రూపాయే పతనమవుతుంది? కారణం ఏంటీ? నేను అడుగుతున్నా ఈ దేశంలో ఓ ముఖ్యమంత్రిగా ….. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి పడిపోయింది. మోదీ హయాంలో ఇంత భారీగా పడిపోవడానికి గల కారణాలపై ప్రశ్నించాను. భారతదేశం రూపాయి విలువ ఇంత దరిద్రంగా పడిపోయింది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాను. ఇది అవివేకమా? అసమర్థతనా? దీనికి దేశ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? డబ్బాలో రాళ్లుపోసినట్లు లొడ లొడ వాగడం కాదు అలా అరచిపోతమంటే కుదరదు కదా? అంటూ కేసీఆర్ మండిపడ్డారు.