ఎంపీ కవితకు అభినందనల వెల్లువ…

240
mp kavitha
- Advertisement -

ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు అందుకున్న నిజామాబాద్ ఎంపీ కవితకు అభినందనలు వెలువడుతున్నాయి.పలువురు టీఆర్ఎస్ ఎంపీలు,ఎమ్మెల్యేలు,నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెర్ఫ్‌ కార్యాలయాల్లో గురువారం సంబరాలు జరుపుకున్నారు.

సెర్ప్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కేక్ కట్‌చేసి, స్వీట్లు పంపిణీచేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపీ కవిత అవార్డు అందుకోవడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు సెర్ప్ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు కుంట గంగాధర్‌రెడ్డి.

ఢిల్లీలో ఎంపీ కవితను కలిసి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం(టస్మా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు .ఎంపీ కవితకు అభినందలు తెలిపినవారిలో ఢిల్లీ ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు ప్రేమ్‌చంద్ బిశ్వాల్, నిజామాబాద్ జిల్లా ట్రస్మా అధ్యక్షుడు జయసింహాగౌడ్ తదితరులున్నారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్‌,ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.

లోక్‌సభలో 545మంది ఎంపీల‌లో 25మంది ఎంపీలను ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేశారు. ప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవాదృక్పథం, లోక్‌సభకు హాజరు, లోక్‌సభ నిర్వహణలో పాత్ర, నియమనిబంధనలు పాటించడం, ప్రశ్నలగడం తదితర అంశాల ఆధారంగా ఎంపీలను ఈ అవార్డుకు ఎంపికచేశారు.ఉద్యమ సమయంలో అమెరికానుంచి వచ్చి తెలంగాణ ఉద్యమంలో భాగంగా సాంస్కృతిక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, ప్రజలను చైతన్యపర్చడంలో కవిత క్రియాశీలకంగా వ్యవహరించారు. బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఎంపీ క‌విత‌ చురుగ్గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆమెను ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేశారు.

- Advertisement -