బెల్లంకొండ శ్రీనివాస్-కాజల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్ర కవచం. ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై అంచనాలు పెరిగిపోగా ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో కవచంతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమాతో శ్రీనివాస్ ఆకట్టుకున్నాడా..?సినిమా ఎలా ఉందో చూద్దాం..
కథ :
విజయ్ (బెల్లంకొండ శ్రీనివాస్) విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్స్‌పెక్టర్. నిజాయితీగా పని చేసే విజయ్ ఓ కాఫీ షాప్‌లో పనిచేసే అమ్మాయి(కాజల్)తో ప్రేమలో పడతాడు. కానీ ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పే లోపే కాజల్‌కి పెళ్లి కుదరటంతో విజయ్‌కి దూరమవుతుంది. తర్వాత ఓ ప్రమాదం నుంచి సంయుక్త(మెహరీన్)ని కాపాడతాడు విజయ్.సీన్ కట్ చేస్తే విజయ్ తల్లికి యాక్సిడెంట్ కావటంతో డబ్బుకోసం ఓ నాటకం ఆడతాడు. కానీ అది రీవర్సై చిక్కుల్లో పడతాడు. అసలు విజయ్ ఆడిన నాటకం ఏంటి..?ఏ విధంగా చిక్కుల్లో పడ్డాడు..?చివరికి కథ ఎలా సుఖాంతం అయిందనేది తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథలో మలుపులు,యాక్షన్ సీన్స్. మాస్ హీరోగా మరోసారి తనంటే ప్రూవ్ చేశాడు శ్రీనివాస్. పోలీస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. కాజల్,మెహ్రీన్ తమ గ్లామర్‌తో సినిమాకు మరింత ప్లస్‌గా మారారు. తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. విలన్‌గా మెప్పించాడు బాలీవుడ్ స్టార్ నీల్ నితిన్ ముఖేష్.ఇతర పాత్రల్లో ముఖేష్ రుషి,పోసాని తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ సంగీతం,ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్.చాలా చోట్ల కథ స్లోగా నడుస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో కిడ్నాప్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప మిగతా కథనమంతా నెమ్మదిగా నడుస్తూ సహనాన్ని పరీక్షిస్తుంది. క్లైమాక్స్ ఆకట్టుకోలేదు.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమాకు మంచిమార్కులే పడ్డాయి. తమన్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. నేపథ్యం సంగీతం బాగున్నా కొన్ని సన్నివేశాలను డామినేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి సూపర్బ్. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
యాక్షన్ థ్రిల్లర్ అన్న జానర్‌కు తగ్గట్టుగా మంచి ట్విస్ట్‌లతో కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు శ్రీనివాస్ . కథ,యాక్షన్ సీన్స్ సినిమాకు ప్లస్ కాగా అక్కడక్క నెమ్మదించిన కథనం మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా కవచంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు శ్రీనివాస్.
విడుదల తేదీ:07/12/18
రేటింగ్: 2.5/5
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్
సంగీతం : తమన్ ఎస్‌ఎస్
నిర్మాత : నవీన్ శొంఠినేని
దర్శకత్వం : శ్రీనివాస్ మామిళ్ల