అందాల కత్రినా కైఫ్ జిమ్ ట్రైనర్‌గా మారింది. తన స్నేహితురాలు, యంగ్ హీరోయిన్ అలియా భట్ కోసం ట్రైనర్‌గా మారడంతో పాటు ఆమెతో కొన్ని స్వ్కాట్స్ కూడా చేయించింది. ఇదంతా సినిమా కోసం కాదండి. నిజంగానే. సమయానికి ట్రైనర్ రాకపోయేసరికి కత్రినా ట్రైనర్‌గా మారి, ఆలియాతో కరసత్తులు చేయిస్తోంది.జిమ్ ట్రైనర్‌గా ఆలియాకు సూచనలిస్తున్న ఓ వీడియోను కత్రినా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇద్దరు భామలు కసరత్తు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
“అలియా భట్ చాలా బాగా చేస్తున్నావు. టెన్షన్ పడకు ఇక కేవలం 300 స్వ్కాట్స్ మాత్రమే ఉన్నాయని” తెలిపింది. ఇక వీడియోలో బరువులు మోయలేక ఆలియా కష్టపడుతుండగా, కత్రినా మధ్య మధ్యలో ఆలియాను ప్రోత్సహిస్తుండగా ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. కత్రినా ప్రస్తుతం సల్మాన్‌కు జోడిగా‘ టైగర్ జిందా హై’,లో అమీర్ ఖాన్ కు జోడీగా ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రాల్లో నటిస్తోంది. ఆలియా భట్ ‘రాజీ’ సినిమాలో నటిస్తోంది. ఎప్పడు సినిమాలతో బిజిగా ఉండే ఈ అందాల భామలు ఫిట్నెస్ విషయంలో చాలా జాగత్రలు తీసుకుంటున్నారు.