కచ్చితంగా కట్టితీరుతాం : కేసీఆర్‌

164
Telangana CM KCR Excellent Speech On New Secretariat
- Advertisement -

రాష్ర్టానికి సచివాలయం గొప్ప గౌరవ సూచకంగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. శాసనసభలో సీఎం మాట్లాడుతూ..సచివాలయం పై వితండవాదం వద్దని.. కచ్చితంగా వందేళ్ల వరకు ఉండేలా నిర్మాణాలు చేపడతామన్నారు.

ఈ నిర్మాణాలు తనకొచ్చిన ఆలోచన కాదని.. 1969కంటే ముందు… నీలం సంజీవరెడ్డి కాలంలోనే తీసుకున్నారన్నారు. బ్రహ్మానందరెడ్డి సమయంలో కూడా ఈ ఆలోచన ఉందని.. అయితే అవి ముందుకు సాగలేదన్నారు. జీహెచ్ఎంసీ అనుమతులు కూడా తీసుకోలేదన్నారు. పార్కింగ్ , ఫైరింగ్ సదుపాయాలు లేవని అన్నారు. అందుకే కొత్త సచివాలయం, శాసనసభ నిర్మాణం చేపట్టామన్నారు.

సచివాలయంలో సీఎం ఉండే సీ బ్లాక్ అధ్వాన్నంగా ఉందని, ఫైరింజన్ పోయి ఆపరేట్ చేసే స్థలం కూడా లేదన్నారు. సీ బ్లాక్ అయితే మరీ దారుణంగా ఉందన్నారు. ఇష్టం వచ్చిన రీతిలో సచివాలయాన్ని కట్టారని ధ్వజమెత్తారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైర్ సెఫ్టీ పూర్తిగా లోపించిందన్నారు. దేశంలో ఏ రాష్ర్టానికి పోయినా అక్కడి సచివాలయం ఆ రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా ఉంటుందన్నారు. మనం కూడా అలాగే నిర్మించుకోవాలని చెప్పారు.

సచివాలయం, శాసనసభ, హెచ్‌వోడీల కార్యాలయాలు కట్టాలనే ప్రతిపాదన ఉందన్నారు. ఈ కాంప్లెక్స్‌లన్నీ రూ. 500 కోట్లలోపే నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. మొదటగా సచివాలయం, శాసనసభను నిర్మిస్తామన్నారు. ఈ నూతన భవనాలకు ప్రధాని నరేంద్రమోదీతో భూమిపూజ చేయిస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు అతిసుందరమైన కట్టడాన్ని అందించి ఇస్తామన్నారు.

- Advertisement -