ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మళ్లీ టాపే…

195
- Advertisement -

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ మళ్లీ అగ్రస్ధానంలో నిలిచింది.  కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ సులభతర వాణిజ్యం చేస్తున్న రాష్ర్టాల ర్యాంక్‌లను తాజాగా రిలీజ్ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ టాప్ ప్లేస్‌లో నిలిచింది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసురావడంతో పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి.

కొత్తగా ఏర్పడిన తెలంగాణ.. బిజినెస్‌లో మునుముందుకు వెళ్తున్న తీరు ఇతర రాష్ర్టాలను కూడా ఆకట్టుకుంటున్నది. తెలంగాణ తర్వాత స్ధానంలో హర్యానా, పశ్చిమబెంగాల్ ఉన్నాయి. గత ఏడాది కూడా తెలంగాణ నెంబర్ 1 స్ధానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.

 telangana top in ease of doing business
సులభతర వాణిజ్యానికి అనుకూలంగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచింది. ప్రపంచబ్యాంక్ దేశంలోని 17 నగరాలకు ర్యాంక్‌లను ప్రకటించింది. అందులో హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో లూథియానా దక్కించుకున్నది.

ప్రపంచబ్యాంకు, కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక కింద సులభతర వ్యాపార నిర్వహణపై ర్యాంకుల విధానాన్ని చేపట్టింది. పారిశ్రామిక, వాణిజ్య రంగాలతో పాటు ఇతర రంగాల్లో సంస్కరణల ప్రాతిపదికన రాష్ర్టాలకు ర్యాంకులను కేటాయిస్తుంది. అనుమతులు, లైసెన్సింగ్ విధానం, ప్రభుత్వం సహకారం ఇతర అంశాల ఆధారంగా ర్యాంకులను ఖరారు చేస్తారు.

- Advertisement -