కత్తి నోట.. శ్రీరాముని పాట..

314
kathi-mahesh
- Advertisement -

శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కత్తి మహేష్ నగర బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. 6 నెలల పాటు హైదరబాద్ నగరంలో అడుపెట్టవద్దని, తమ అనుమతి లేకుండా హైదరాబాద్ వస్తే మూడు సంవత్సరాల జైలు శిక్షకు అర్హుడివి అని పోలీసులు సూచించారు. నగర బహిష్కరణతో, కత్తి మహేష్ చిత్తూరులోని తన సొంత ఊరుకి వెళ్లిపోయారు. అయితే నిన్నటి వరకు శ్రీరాముడిని ఇష్టం వచ్చినట్లు తిట్టిన కత్తి.. నేడు శ్రీరామనాస్మరణ చేస్తున్నాడు.

kathi-mahesh

శ్రీరాముడిని పొగుడుతూ శ్లోకాలతో కూడిన పాటను పాడి అందరిన ఆశ్చర్యానికి గురి చేశాడు. శ్రీరాముడిని దగుల్భాజీ అన్న నోటితోనే.. రాముడిని పొగుడుతూ పాట పాడడం గమనార్హం. నిమిషంకి పైగానే పాట పాడిన ఈ వీడియోని కత్తి మహేష్ సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. భయంతో పాడుతున్నాడా..? లేక భక్తితో పాడుతున్నాడా..? అంటూ కొందరు కామెంట్లు చేయగా… ఇప్పటికైనా బుద్ది వచ్చిందని కొందరు, కొడతారనే భయంతో రాముడిని పొగుడుతున్నాడని మరొకొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు స్వామి పరిపూర్ణనందకు మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే.

- Advertisement -