బిగ్ బాస్3లో మొదటి ఎలిమినేటర్ ఎవరో చెప్పిన కత్తి మహేశ్

488
bigboss3 kathi mahesh
- Advertisement -

ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ 3 ప్రారంభమై విజయవంతంగా నడుస్తోంది. పెద్ద ఎత్తున అభిమానులు బిగ్ బాస్ షోను ఆదరిస్తున్నారు. మొదటి వారం టీఆర్పీ కూడా చాలా బాగుంది. ఇక ఇప్పుడు మొదటి వారం ఎవరు ఎలిమినెట్ అవుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బిగ్ బాస్ అభిమానులు. హేమ, శ్రీముఖి, రాహుల్, వితిక, వరుణ్, మహేశ్ విట్ట, హిమజ… లాంటి కంటెస్టెంట్లు గొడవలతో షోకు కాస్త పాపులారిటీ తీసుకొచ్చారు.

మొదటి వీక్ లో ఎలిమినేషన్ లో రాహుల్, హేమ, శ్రీముఖి, జాఫర్, హిమజ, వితిక ఉన్నారు. వీళ్లలో ఎవరో ఒకరు షోను వదిలి వెళ్లిపోవాల్సిందే. అయితే బిగ్ బాస్ 3 హౌస్ లో నుంచి వెళ్లిపోయే మొదటి వ్యక్తి ఎవరో చెప్పేశాడు ప్రముఖ క్రిటిక్ కత్తి మహేశ్. ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు.

నోరు జారినోళ్లే మొదటి వారంలో ఎలిమినేట్ అవుతారు. బిగ్ బాస్ 1 లో జ్యోతి, బిగ్ బాస్ 2లో సంజన, బిగ్ బాస్ 3లో రాహుల్ బయటికి వెళ్లే చాన్స్ కనిపిస్తోంది అంటూ పోస్ట్ పెట్టాడు కత్తి మహేశ్. ఫుడ్ విషయంలో రాహుల్ హేమ, శ్రీముఖితో గొడవపడిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ 3లో మొదటి ఎలిమినేటర్ ఎవరో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

- Advertisement -