పవన్‌ వన్ మ్యాన్‌ షో..

180
- Advertisement -

సర్దార్‌గబ్బర్‌ సింగ్‌’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఆ లోటు భర్తీ చేసేందుకు ఈ సారిఅన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుని ‘కాటమరాయుడు’తో మళ్లీ వచ్చాడు పవన్‌కల్యాణ్‌. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వీరమ్‌’కి ఇది రీమేక్‌. అయినా పవన్‌ శైలికి, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కొన్ని మార్పులు చేసింది చిత్ర యూనిట్.

‘కాటమరాయుడు’ చిత్రం సందడి తెలుగు రాష్ట్రాలలో ఈ ఉదయం నుంచే మొదలైంది. అయితే, కువైట్, మస్కట్ దేశాల్లో ఈ సినిమా ఇప్పటికే విడుదలైంది. అక్కడి ప్రేక్షకుల సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో పవన్ చాలా హుషారుగా కనిపించాడని సమాచారం. సినిమా అంతటా పంచెకట్టుతో కనిపించే పవన్ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దారని, శ్రుతి హాసన్ తో లవ్ ట్రాక్ బాగా పండిందని కువైట్ ప్రేక్షకులు చెబుతున్నారు.

pawan

డ్యాన్స్ పై మరింతగా పవన్ దృష్టి పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డ ప్రేక్షకులు, ‘కాటమరాయుడు’ క్లైమాక్స్ రసవత్తరంగా ఉందని అంటున్నారు. కాగా, ఈ చిత్రంలో పవన్ వన్ మ్యాన్ షో చేశారని పవర్ స్టార్ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా చెబుతున్నారు.

తమిళంలో ఘనవిజయం సాధించిన వీరమ్‌ కథని దాదాపు ఫాలో అయిపోయాడని అంటున్నారు. అత్తారింటికి దారేది తర్వాత పవన్‌కల్యాణ్‌లోని చలాకీదనం ఈ సినిమాలోనే కనిపించిందని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పవన్‌కల్యాణ్‌ కోసం.. ఆయన అభిమానుల కోసం తీసిన సినిమా. పవన్‌ తన అభిమానులను అలరించేందుకు శాయశక్తులా కృషి చేశాడు. పవన్‌ బలం వినోదం పంచడం. అది ఏ సన్నివేశంలోనూ లోటుకాకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ సినిమా వన్‌మాన్‌షోగా నిలిచిపోయిందని పవన్ ఫ్యాన్స్‌ అంటున్నారు.

- Advertisement -